శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 డిశెంబరు 2022 (22:25 IST)

హైదరాబాద్ (IITH)లో క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IITH)లో క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లు శరవేగంగా జరుగుతున్నాయి. IITH 508 ఆఫర్‌లను నివేదించింది, ఇందులో 54 అంతర్జాతీయ ఆఫర్‌లు ఉన్నాయి. డిసెంబర్ 1-7 మధ్య జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ల ఫేజ్-1 సమయంలో 144 కంపెనీల నుండి అందుకుంది.
 
మొత్తం నియామక ప్రక్రియ హైబ్రిడ్ విధానంలో జరిగింది. ఈ ఏడాది డిపార్ట్‌మెంట్‌ల వారీగా మొత్తం 700 మందికి పైగా విద్యార్థులు ప్లేస్‌మెంట్ కోసం నమోదు చేసుకున్నారని ఐఐటీహెచ్ అధికారులు శుక్రవారం తెలిపారు.
 
అత్యధిక ప్యాకేజీ రూ. 63.78 లక్షలు, కొనసాగుతున్న ఫేజ్-1 ప్లేస్‌మెంట్‌ల కోసం సగటు ప్యాకేజీ రూ.19.49 లక్షలు అని అధికారులు తెలిపారు.