బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 12 నవంబరు 2016 (12:50 IST)

రూ.2వేల రూపాయల నోట్లను కేంద్రం వెనక్కి తీసుకోబోతుందా? సోషల్ మీడియాలో ప్రచారం పరిస్థితేంటి?

రూ.500 రూ. 1000 నోట్లు రద్దుతో మార్కెట్లోకి వచ్చిన రూ.2వేల రూపాయల నోట్లను ప్రభుత్వం వెనక్కి తీసుకోబోతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. నోటు వెనుక భాగంలో 15 భాషల్లో 2వేల రూపాయలని ముద్రించడ

రూ.500 రూ. 1000 నోట్లు రద్దుతో మార్కెట్లోకి వచ్చిన రూ.2వేల రూపాయల నోట్లను ప్రభుత్వం వెనక్కి తీసుకోబోతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. నోటు వెనుక భాగంలో 15 భాషల్లో 2వేల రూపాయలని ముద్రించడం జరిగింది. 
 
అయితే అలా ముద్రించేటప్పుడు 'దోన్ హజార్ రూపయా' అని ఒకసారి, 'దోన్ హజార్ రుపయే' అని మరోసారి ఉందని.. ఇది స్పెల్లింగు తప్పు కావడంతో మొత్తం రెండువేల రూపాయల నోట్లను కంద్రం వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. 
 
అయితే ఇవన్నీ రూమర్లేనని.. రూ.2వేల నోట్లలో ఎలాంటి తప్పు లేదని తెలిసింది. రెండు వేల రూపాయల నోటులో ముద్రించిన భాషల ప్యానల్‌లో అసలు హిందీ భాష లేనే లేదని.. నోటుకు వెనక భాగంలో ఎడమవైపు హిందీలో రాయగా, మిగిలిన మరో 15 భారతీయ భాషలలో మాత్రమే రెండు వేల రూపాయలు అనే అర్థం వచ్చేలా ముద్రించారని ఆర్బీఐ అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇంకా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని అధికారులు చెప్తున్నారు.