30 పైసలకు పడిపోయిన టమోటా ధర.. కప్పు టీ తాగడానికి?
టమోటా ధర కిలో 30 పైసలకు పడిపోయింది. కొన్నిరోజులుగా టమాటా సప్లై పెరగడం, డిమాండ్ తగ్గడంతో ధర దారుణంగా పడిపోయింది. కనీస ధర కూడా రాకపోవడంతో రైతులు విలవిలలాడుతున్నారు.
గురువారం కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో కిలో టమాటా 30 పైసలు పలకడంతో రైతులు మండిపడుతున్నారు. మార్కెట్లో కప్పు టీ తాగడానికి కనీసం 30 కిలోల టమాటాలను అమ్మాల్సిన పరిస్థితి నెలకొందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రిటైల్ మార్కెట్లో టమాటా కిలో రూ.20లకు అమ్ముతుండగా.. హోల్ సేల్ మార్కెట్లో మాత్రం వ్యాపారులు కనీస ధర కూడా పెట్టడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు.