గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జూన్ 2022 (13:25 IST)

పడిపోతున్న టమోటా ధరలు

టమోటా ధరలు భారీగా పతనమవుతున్నాయి. కర్ణాటక, తమిళనాడుల్లో టమోటా దిగుబడులు అధికంగా ఉండడం, ఇక్కడి రైతులు కూడా సాగు చేపట్టడం ధరల పతనానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. 
 
కాగా మే చివరి వరకూ 15 కిలోల బాక్సు రూ.900 నుంచి రూ.1,200 వరకు పలికింది. ఈ నెల ప్రారంభం నుంచి ధరలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా మార్కెట్లలో శుక్రవారం 15కిలోల బాక్సు ధర రూ.420, పుంగనూరులో రూ.400 పలికింది. 
 
10వ తేదీ రూ.650 పలకగా నాలుగు రోజులుగా క్రమంగా ధరలు పతనబాట పడ్డాయి. గురువారం రూ.580కు, శుక్రవారం రూ.420కి పడిపోయింది. తమిళనాడు వ్యాపారులు కుప్పం, పలమనేరు, పుంగనూరు తదితర మార్కెట్లకు వచ్చి టమోటా కొనుగోలు చేస్తారు.