బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 28 ఆగస్టు 2023 (22:27 IST)

పూర్తి సరికొత్త టొయోటా రూమియన్ కోసం బుకింగ్‌లను ప్రారంభించిన టయోటా

Rumion
టయోటా కిర్లోస్కర్ మోటర్ (TKM), ఈరోజు అధికారికంగా బుకింగ్‌ల ప్రారంభాన్ని, దాని తాజా ఆఫర్ పూర్తి సరికొత్త  టొయోటా రూమియన్ ధరలను ప్రకటించింది. దీనిని ఆగస్ట్'23 నెల ప్రారంభంలో విడుదల చేశారు, ఇది వినియోగదారుల నడుమ పూర్తి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఆరు గ్రేడ్‌లలో అందుబాటులో ఉన్న ఈ అసాధారణమైన కొత్త కాంపాక్ట్ B-MPV దాని సాటిలేని స్థలం, సౌకర్యం, అద్భుతమైన ఇంధన సామర్థ్యం, ఆకర్షణీయమైన మరియు ప్రీమియం బాహ్య డిజైన్‌తో కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుందని భావిస్తున్నారు.
 
TKM యొక్క తాజా ఆఫర్ ఆకర్షణీయమైన ఎక్స్-షోరూమ్ ధరలలో రూ. 10,29,000 నుండి రూ. 13,68,000లో లభిస్తుంది. దీని డెలివరీలు సెప్టెంబర్ 8 నుండి ప్రారంభమవుతాయని అంచనా. బుకింగ్‌లు రూ. 11,000/-టోకెన్ మొత్తంతో ప్రారంభమవుతాయి.