గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 10 జులై 2019 (12:46 IST)

హెలికాఫ్టర్ సేవలను ప్రారంభించిన ఉబెర్... రేటు వింటే బైర్లు కమ్మాల్సిందే...

దేశవ్యాప్తంగా ఉబెర్ క్యాబ్ సర్వీసులతో కష్టమర్లకు చేరువైన ఉబెర్ కంపెనీ... తాజాగా హెలికాఫ్టర్ సేవలను కూడా ప్రారంభించింది. అయితే, ఈ సేవలకు వసూలు చేసే ధరలు వింటే మాత్రం కళ్లు బైర్లుకమ్మాల్సిందే. ప్రస్తుతం ఉబెర్ కంపెనీ దేశంలోని అనేక రాష్ట్రాల్లో రోడ్డు మార్గంలో సేవలు అందిస్తోంది. తాజాగా ఉబెర్ ఎయిర్ పేరుతో ఈ సేవలను ప్రారంభించింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న మాన్‌హట్టన్ అనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ నుంచి జాన్ ఎఫ్.కెన్నడీ ఎయిర్ పోర్టు వరకు ఈ సేవలను తొలుత ప్రారంభించింది. 
 
ఈ సేవలు ప్రస్తుతం ఉబెర్ డైమండ్, ప్లాటినం కస్టమర్లకు మాత్రమే పరిమితం చేసింది. ఈ సేవల కోసం న్యూజెర్సీకి చెందిన హెలీఫ్లైట్ అనే సంస్థతో ఉబెరి యాజమాన్యం ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రోజుకు కేవలం 8 నుంచి 10 సర్వీసులను మాత్రమే నడుపనుంది. అయితే, ఈ సేవల కోసం ఆ కంపెనీ ప్రతి 8 నిమిషాలకు రూ.15 వేలు చొప్పున వసూలు చేయనుంది. త్వరలోనే ఈ సేవలను భారత్‌లో కూడా అందుబాటులోకి తీసుకునిరానున్నట్టు చెప్పారు.