బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 28 ఏప్రియల్ 2021 (18:22 IST)

ది కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్‌తో యూఎఫ్ఓ మూవీస్ భాగస్వామ్యం

వినోద పరిశ్రమలో ఓ ఆసక్తిదాయక పరిణామం చోటు చేసుకుంది. యూఎఫ్ఓ మూవీస్ ఇండియా లిమిటెడ్ (యూఎఫ్ఒ), కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్ ప్రై.లి. రెండూ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. దీని కింద, వివిధ బ్రాండ్లకు ఇవి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, బ్రాండెడ్ కంటెంట్, సోషల్ మీడియా సొల్యూషన్స్ ను అందించనున్నాయి. తమ సంబంధిత కార్యకలాపాల విస్తరణకు ఉమ్మడి ఆశయం కలిగిన నేపథ్యంలో ఈ రెండు శక్తివంతమైన సంస్థలు కలసిపని చేయడం సాధ్యమైంది. తమ రంగాల్లో ఇప్పటికే మార్కెట్ అగ్రగాములుగా ఉన్న ఈ రెండు సంస్థలు తమ ప్రస్తుత బలాలను, మౌలిక వసతులనూ పెంచుకోనున్నాయి.
 
కరోనా మహమ్మారి యావత్ పరిశ్రమలను కుదిపేస్తున్నప్పటికీ, ఈ రెండు సంస్థల మధ్య సహకారం అత్యున్న త స్థాయిలో వినూత్న డిజిటల్ ఫస్ట్‌గా హైపర్ లోకల్ సేవలను అందించనుంది. ఈ రెండు సంస్థల శక్తి సామర్థ్యాలను ఇది వెల్లడించనుంది. ఈ అనుబంధంలో భాగంగా యూఎఫ్ఒ, బిగ్ బ్యాంగ్ సోషల్ (కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నె ట్ వర్క్ కు చెందిన ఇన్షియేటివ్) కలసి ఎండ్-టు-ఎండ్ సోషల్ మీడియా, బ్రాండెడ్ కంటెంట్ సొల్యూషన్స్ ను దేశవ్యాప్తంగా స్థానిక, అంతర్జాతీయ బ్రాండ్లకు అందించనున్నాయి. వాటి నెట్వర్క్‌లను గరిష్ఠస్థాయిలో స ద్వినియోగం చేసుకోవడం అంటే రెండు సంస్థలకు కూడా నిలకడతో కూడి వృద్ధి దిశలో పయనించడమే అవుతుంది. కోవిడ్ మహమ్మారి సమయంలో ఎదుర్కొన్న వ్యాపార మాంద్యాన్ని అధిగమించేందుకు ఇది వీలు కల్పిస్తుంది.
 
‘ది కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్ వర్క్’ అనేది సెలెబ్రెటీలు, సోషల్ మీడియా ప్రభావశీలుర పటిష్ఠ నెట్ వర్క్. యూఎఫ్ఓ మూవీస్ అనేది దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వృత్తినిపుణుల సేల్స్, మార్కెటింగ్ లకు సంబంధించిన జట్టు. ఈ అనుబంధం రెండు సంస్థలకు దిగువ పేర్కొన్న విధంగా ప్రయోజనం కలిగించనుంది.
 
- దేశవ్యాప్తంగా యూఎఫ్ఓ యొక్క సేల్స్, మార్కెటింగ్ అనుభవజ్ఞులైన వారితో కూడిన జట్టు సేవలను మాత్రమే కాకుండా వివిధ విభాగాల్లో 2000 మందికి పైగా క్లయింట్లతో కూడిన బేస్‌ను యాక్సెస్ చేయడం ద్వారా ది కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్ తన సోషల్ మీడియా అసెట్స్ మానిటైజేషన్‌ను వేగవంతం చేయగలుగుతుంది.
 
- ఇన్- సినిమా అడ్వర్టయిజింగ్  ప్రధాన వ్యాపారానికి తోడుగా వేగంగా వృద్ధి చెందుతున్న సోషల్ మీడియా అడ్వర్టయిజింగ్ విభాగంలోనూ యూఎఫ్ఓ తన రీచ్‌ను విస్తరించుకోగలుగుతుంది.
 
- వివిధ రకాల పరిశ్రమలల్లో బ్రాండ్ బిల్డింగ్ కార్యకలాపాలకు సంబంధించి (సెలెబ్రెటీలు, సోషల్ మీడి యా ప్రభావశీలుర ద్వారా) ఇన్ఫ్లుయెన్సర్ మేనేజ్మెంట్ అండ్ బ్రాండెడ్ కంటెంట్ అధిక, వేగవంతమైన మానిటైజేషన్ కు ఈ అనుబంధం తోడ్పడుతుంది.
 
ఈ సహకారంలో ఉన్న సహేతుకత గురించి ది కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్ సహవ్యవస్థాపకులు, గ్రూప్ సీఈఓ విజయ్ సుబ్రమణియం వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘ఎప్పటికప్పుడు మారుతూ ఉండే బ్రాండ్ మార్కెటింగ్ ప్రపంచంలో పాప్ కల్చర్ ప్రతీ అంశంలో ఉనికి చాటుకోవడంతో పాటుగా శక్తివంతమైన బ్రాండ్ల కోసం శక్తివంతమైన డిజిటల్ నేరేటివ్ ను రూపొందించడం మా ముఖ్య ఆశయం. పాప్ కల్చర్ పరిరక్షకులుగా మేం ఓ దశాబ్ది కాలంలో భారతీయ కార్పొరెట్ సంస్థలకు ప్రముఖ సలహాదారులుగా ఉన్నాం.
 
బిగ్ బ్యాంగ్ సోషల్‌తో మేం ఇప్పటివరకూ పరిశ్రమలకు అందుబాటులో లేని అవసరమైన వనరులు, నైపుణ్యాలతో కంటెంట్ మార్కెటింగ్, ఇన్ఫ్లుయెన్సర్ మేనేజ్మెంట్‌ను కూడా పరిశ్రమలకు అందించనున్నాం. ఈ సేవలన్నీ కూడా ఇప్పుడు ప్రతీ బ్రాండ్ మార్కెటింగ్‌లో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. బ్రాండ్ బిల్డింగ్ కీలకంగా మారింది. డిజిటల్ విభాగంలో చురుగ్గా ఉన్న వారంతా కూడా ఈ వ్యూహాన్ని అనుసరించకతప్పదు. ఇప్పటివరకూ అలా లేని వారు ఇప్పుడు డిజిటల్ అంశాల్లో మా నైపుణ్యాలతో ఎంతగానో లబ్ధి పొందగలరు’’ అని అన్నారు.
 
యూఎఫ్ఓ మూవీస్ ఇండియా లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కపిల్ అగర్వాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘తమకు సంబంధించిన వర్గాలకు తమ బ్రాండ్ ను తెలియజేసేందుకు జాతీయ, స్థానిక ప్రభావశీలురతో భాగస్వామ్యం పొందే అవకాశాల కోసం బ్రాండ్లు, మార్కెటీర్లు ఎప్పుడూ ఎదురుచూస్తుంటారనే విషయం మేం అర్థం చేసుకున్నాం. భారతదేశం డిజిటల్ విభాగంలో మెరుపువేగంతో పురోగమిస్తోంది. ఈ అను బంధంతో జాతీయ, ప్రాంతీయ కార్పొరెట్ క్లయింట్లు, ప్రభుత్వరంగ సంస్థలు, పీఎస్ఈలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో సహా వివిధ పరిశ్రమల్లో బ్రాండ్లకు మా దేశవ్యాప్త ఉనికి, ఉన్నతస్థాయి నెట్ వర్క్ తో సేవలు అందించేందుకు వీలవుతుంది’’ అని అన్నారు.