శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 15 డిశెంబరు 2020 (19:23 IST)

2040 నాటికి కార్బన్‌ నెగిటివ్‌గా మారతామని పునరుద్ఘాటించిన దాల్మియా సిమెంట్‌

చిలీ మరియు ఇటలీ దేశాల భాగస్వామ్యంతో డిసెంబర్‌ 12వ తేదీన పారిస్‌  వాతావరణ ఒప్పందం ఐదవ వార్షికోత్సవం పురస్కరించుకుని వాతావరణ ఆశయ సదస్సు 2020ను యునైటెడ్‌ నేషన్స్‌, యుకె, ఫ్రాన్స్‌ దేశాలు నిర్వహించాయి. ప్రభుత్వాలు, పౌర సమాజం, ప్రైవేట్‌ రంగంలు మరింత ఆశాజనకంగా మరియు వృద్ధి చెందిన వాతావరణ నిబద్ధతలను పునరుద్ఘాటించడంతో పాటుగా గ్లోబల్‌ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు  పరిమితం చేయగలమనే వాగ్ధానం ప్రదర్శించే అవకాశమూ కలిగింది.
 
ఈ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ మాట్లాడుతూ పారిస్‌ వాతావరణ ఒప్పంద లక్ష్యాలను తాము ఏ విధంగా చేరుకుంటున్నదీ వెల్లడించడంతో పాటుగా దేశంలో ఉద్గార స్ధాయిలు 21%కు తగ్గించి 2005 స్థాయిలకు తీసుకువచ్చామన్నారు.
 
వాతావరణ ఆశయ సదస్సు ముగింపు సందర్భంలో కాప్‌ -26 అధ్యక్షులు మరియు యుకె ప్రభుత్వ స్టేట్‌ ఫర్‌ బిజినెస్‌ సెక్రటరీ వాతావరణ సంక్షోభ నివారణలో ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ రంగ నిబద్ధతలను ప్రశంసించారు. యాపిల్‌, దాల్మియా సిమెంట్‌లు నెట్‌ జీరో నిబద్ధతలను వెల్లడించడం పట్ల ఆయన ధన్యవాదములు తెలిపారు.
 
అంతర్జాతీయంగా మొట్టమొదటి హెవీ ఇండస్ట్రీ రంగ కంపెనీగా దాల్మియా సిమెంట్‌ (భారత్‌) లిమిటెడ్‌ తాము 2018లోనే తాము 2040 నాటికి కార్బన్‌ నెగిటివ్‌ నిబద్ధతను చాటామని వెల్లడించింది మరియు ఈ రంగంలో ఇన్ల్ఫూయెన్సర్‌గానూ సేవలను అందించనుంది. అంతర్జాతీయంగా అత్యంత సమర్థవంతమైన సిమెంట్‌ కంపెనీలలో ఒకటిగా నిలువడమే కాదు అతి తక్కువ కార్బన్‌ ఫుట్‌ప్రింట్స్‌ విడుదల చేసిన కంపెనీలలో ఒకటిగా నిలిచింది(సిమెంట్‌ తయారీలో).
 
ఈ సదస్సులో దాల్మియా సిమెంట్‌ (భారత్‌) లిమిటెడ్‌ యొక్క భాగస్వామ్యం వాతావరణ చర్యలు మరియు ధైర్యవంతమైన నిబద్ధతలలో దీనియొక్క నాయకత్వ పాత్రకు గుర్తింపుగానూ నిలుస్తుంది. అంతర్జాతీయంగా హెవీ ఇండస్ట్రీ సెక్టార్‌లో ఆహ్వానం పొందిన ఒకే ఒక్క సంస్ధ ఇది. 2040 కార్బన్‌ నెగిటివ్‌ నిబద్ధతను అక్కడ పంచుకోవడంతో పాటుగా అంతర్జాతీయ సిమెంట్‌ మరియు కాంక్రీట్‌ అసోసియేషన్‌ యొక్క 2050 కార్బన్‌ న్యూట్రల్‌ కాంక్రీట్‌ నిబద్ధతనూ వెల్లడించాల్సి ఉంటుంది.
 
యునైటెడ్‌ నేషన్స్‌ క్లైమెట్‌ యాంబిషన్‌ సదస్సు2020 వద్ద శ్రీ మహేంద్ర సింఘీ, ఎండీ అండ్‌ సీఈవో, దాల్మియా సిమెంట్‌ (భారత్‌) లిమిటెడ్‌ మాట్లాడుతూ మనందరం ఎదుర్కొంటున్న అసాధారణ వాతావరణ సవాళ్లను అధిగమించేందుకు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయనే మరింతగా మాట్లాడుతూ దాల్మియా సిమెంట్‌ ఇప్పుడు వాతావరణ మార్పులను తగ్గించేందుకు తగిన చర్యలు చేపడుతుందని, మరింత సుస్థిరమైన సిమెంట్‌ మరియు నిర్మాణ రంగాన్ని సృష్టిస్తుందన్నారు. ఆయనే మాట్లాడుతూ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ లాభదాయకమైనది మరియు సుస్ధిరమైనది. దాల్మియా సిమెంట్‌ యొక్క వ్యాపార సిద్ధాంతంలో కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడంలో వ్యాపార అవకాశాలనూ సృష్టించడం ద్వారా సహ ప్రయోజన విధానం అనుసరించనుంది.
 
అంతర్జాతీయ భాగస్వామ్యాల పట్ల శ్రీ సింఘి మరింతగా చెబుతూ అంతర్జాతీయంగా వాటాదారులతో దాల్మియా సిమెంట్‌ యొక్క భాగస్వామ్యాలు కార్బన్‌ నెగిటివ్‌ యొక్క రోడ్‌మ్యాప్‌ను సాక్షాత్కరించేందుకు 100% పునరుత్పాదక విద్యుత్‌, ఇంధన సామర్థ్య మెరుగుదల, కార్బన్‌ క్యాప్చర్‌మరియు యుటిలైజేషన్‌ (సీసీయు) వంటి డీకార్బనైజేషన్‌ సాంకేతికతలను కేవలం పరివర్తన విధానంలో అమలు చేయడం అవసరమన్నారు.
 
దాల్మియా భారత్‌కు ఎల్లప్పుడూ సస్టెయినబిలిటీ అనేది జీవిత మార్గంగా ఉంటుంది. ఈ కంపెనీ, అంతర్జాతీయంగా అతి తక్కువ కార్బన్‌ ఆర్థిక పరివర్తన సంసిద్ధతలో నెంబర్‌ 1గా సీడీపీ గుర్తించింది. ఈ గ్రూప్‌  ఐదు రెట్లు ఎక్కువగా వాటర్‌ పాజిటివ్‌ కావడంతో పాటుగా ఈపీ 100 మరియు ఆర్‌ఈ 100లో చేరిన ప్రపంచంలోనే మొట్టమొదటి సిమెంట్‌ కంపెనీగానూ నిలిచింది.
 
దాల్మియా సిమెంట్‌ (భారత్‌) లిమిటెడ్‌ తీసుకున్నసస్టెయినల్‌ కార్యక్రమాలను గురించి తన అభిప్రాయాలను శ్రీ సింఘి వెల్లడించారు. దీనితో పాటుగా సస్టెయినబల్‌ వ్యాపారాలు మరియు ఇతర క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమాలలో తాము అనుసరిస్తున్న అత్యున్నత పద్ధతులను గురించి నేడు జరిగిన ఐఎఫ్‌సీ క్లైమెట్‌ బిజినెస్‌ వెబినార్‌లో వెల్లడించారు.