ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 18 ఫిబ్రవరి 2024 (17:01 IST)

ఫుడ్ బిజినెస్‌లోకి ఉపాసన కొణిదెల... పేరు "అత్తమ్మాస్ కిచెన్"

athammas kitchen
మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ. ఆమె తన పుట్టిన రోజు వేడుకలను ఆదివారం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కొత్త వ్యాపారాన్ని కొణిదెల ఫ్యామిలీ ప్రారంభించింది. ఇంటి భోజనాన్ని గుర్తుకు తెచ్చే రెడీ టు మీక్స్ వంటకాలను చిరంజీవి ఇంటి కోడలు ఉపాసన కొణిదెల ఆవిష్కరించారు. వీటిని వెబ్‌సైట్ ద్వారా విక్రయించనున్నారు. అత్తమ్మాస్ కిచెన్ పేరిట వీటిని మార్కెట్ చేయనున్నారు. ఈ వ్యాపారాన్ని మెగా అత్తాకోడళ్లు కలిసి ప్రారంభించారు. 
 
ఇంటి భోజనాన్ని గుర్తుకు తెచ్చేలా ప్రత్యేకంగా రూపొందించిన ఉప్మా, పులిహోర, పొంగల్, రసం రెడీ టు కుక్ ప్యాకెట్లను ఆవిష్కరించారు. అత్తాకోడళ్ల అనుబంధాన్ని పునర్‌ నిర్వచిస్తూ కొణిదెల వారి సంప్రదాయాల స్ఫూర్తిగా సరికొత్త వంటకాలను ప్రజలకు అందించనున్నారు. ఈ వంటకాలను ప్యాకెట్లను ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఇదే అంశంపై ఉపాసన ట్వీట్ చేస్తూ,
upasana - surekha
 
"నేరుగా మా వంట గది నుంచే మీ ఇంటికి ఈ రెడీ టు కుక్ పదార్థాలు అందుతాయి. తరతరాల ఆహార అనుబంధాన్ని ఆస్వాదించండి" అంటూ ట్వీట్ చేశారు. కాగా, అత్తమ్మాస్ కిచెన్ ఉత్పత్తులకు, రెసిపీలకు ప్రచారం కల్పిస్తూ ప్రత్యేకంగా athammaskitchen.com అనే పేరుతో ఓ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. ఈ వంటకాలను ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.