1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. World Bank appoints Indian national Indermit Gill as chief economist

ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్తగా భారతీయుడు

indermit gill
ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్తగా మన దేశానికి చెందిన ఇందర్మీత్ గిల్ నియమితులయ్యారు. ఆయన సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి తన బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రస్తుతం ఆయన ప్రపంచ బ్యాంకులోనే పలు విభాగాలకు ఉపాధ్యక్షుడుగా విధులు నిర్వహిస్తారు. 
 
ఇందర్మీత్ గిల్ ప్రస్తుతం ఈక్విటబుల్ గ్రోత్, ఫైనాన్స్, ఇనిస్టిట్యూషన్ విభాగాల వైస్‌ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం, సెయింట్ స్టీఫెన్ కాలేజీ నుంచి బీఏ హానర్స్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎంఏ పూర్తి చేసిన ఇందర్మీత్ గిల్.. యూనివర్శిటీ ఆఫ్ షికాగో నుంచి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పట్టా అందుకున్నారు. 
 
ప్రస్తుతం ఈయన ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్తగా నియమితులయ్యారు. ఈ పదవిని చేపట్టనున్న రెండో భారతీయుడ ఇందర్మీత్ కావడం గమనార్హం. గతంలో 2012-16 సంవత్సరాల మధ్యకాలంలో కౌశిక్ బస్సు ఈ బాధ్యతలు నిర్వహించిన విషయం తెల్సిందే.
తర్వాతి కథనం
వంట గ్యాస్ రాయితీలో భారీగా కోత... ఇకపై భారం తప్పదా?