పాకెట్ మనీ... అవసరానికి మించితే ప్రమాదకరమే...
పాకెట్ మనీ.. నేడు ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. ముఖ్యంగా విద్యార్థి దశలో పాకెట్ మనీ తప్పనిసరి. పాఠశాలలకు వెళ్లే చిన్నారుల నుంచి కళాశాలలకు వెళ్లే విద్యార్థుల వరకూ పాకెట్ మనీ ఉండి తీరాల్సిందే. అయితే, కొంతమంది వెనుకాముందు చూడకుండా ఇష్టమొచ్చినట్టు ఖర్చు చేస్తారు. మరికొందరు దుబారాకు దూరంగా ఉంటారు.
నిజానికి గతం కంటే నేడు నగరాభివృద్ధి ఎంతగానో పెరిగింది. దీనికి తగినట్టుగానే తమ పిల్లలకు తల్లిదండ్రులు పాకెట్ మనీ ఇస్తున్నారు. అయితే, ఏదైనా అతి అనర్థదాయకమే. ఎక్కువ పాకెట్ మనీ ఇస్తే విద్యార్థుల పెడదోవ పట్టే వీలుంటుంది. ఈ విషయంలో తల్లిదండ్రులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతో మంచింది.