ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 మార్చి 2021 (14:51 IST)

ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. 6552 పోస్టులు ఖాళీ.. క్లర్క్‌లు, స్టెనోగ్రాఫర్స్ కావలెను

దేశవ్యాప్తంగా 6552 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) వెల్లడించింది. వీటి భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియ ఈ నెలాఖరులోగాని, వచ్చే నెలలోగాని ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు.
 
మొత్తం ఖాళీల్లో అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ (యూడీసీ) లేదా అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ క్యాషియర్‌ పోస్టులు 6306, స్టెనోగ్రాఫర్‌ పోస్టులు 246 ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామని వెల్లడించారు.
 
అర్హతలు: స్టెనోగ్రాఫర్‌ పోస్టుకు ఇంటర్‌ పాసైన వారు, క్లర్క్‌ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 18 నుంచి 27 ఏండ్లలోపు వారై ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి. ఎంపిక విధానం: రాతీ పరీక్ష ద్వారా. దీంతోపాటు స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇందులో 10 నిమిషాల్లో నిమిషానికి 80 పదాలు టైప్‌ చేయగలిగే సామర్థ్యం ఉండాలి.