1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By వరుణ్

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు వెల్లడి.. టాప్ లేపిన హైదరాబాద్ కుర్రోడు

jee exam
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 ఫలితాలు ఆదివారం ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో హైదరాబాద్ కుర్రోడు వివిలాల చిద్విలాస్ రెడ్డి కామన్ ర్యాంకు జాబితాలో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకును సొంతం చేసుకుని అగ్రస్థానంలో నిలిచాడు. ఐఐటీ హైదరాబాద్ జోన్‌కు చెందిన చిద్విలాస్ 360కి మార్కులకుగాను 341 మార్కులు సాధించాడు. 
 
అలాగే, అమ్మాయిల్లో నాయకంటి నాగభవ్య శ్రీ 360 మార్కులకుగాను 289 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. గత యేడాదితో పోల్చితే ఈ సారి నెగెటివ్ మార్కింగ్ ప్రశ్నలు తక్కువగా ఉండటంతో పరీక్షల్లో ఎక్కువ కటాఫ్ మార్కులకు అవకాశం ఉందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.