మణిపాల్ హాస్పిస్ అండ్ రెస్పైట్ సెంటర్‌ను ప్రారంభించనున్న మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్
మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (MAHE) భారతదేశంలోనే ప్రత్యేకమైన మణిపాల్ హాస్పిస్ అండ్ రెస్పైట్ సెంటర్ (MHRC)ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. దీనిని ఏప్రిల్ 30, 2025న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌరవనీయులైన జస్టిస్ శ్రీ సయ్యద్ అబ్దుల్ నజీర్ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇది జూలై 2025 నుండి క్లినికల్ సేవలను ప్రారంభించనుంది. MAHE చేపట్టిన ఈ అధిక సామాజిక ప్రభావ కార్యక్రమ సేవలు పూర్తిగా ఉచితం. ఇది తీవ్రమైన అనారోగ్యాల బారిన పడిన రోగులు, వారి కుటుంబాలకు సమగ్ర హాస్పిస్ సేవలను అందిస్తుంది.
ఈ సౌకర్యం కస్తూర్బా మెడికల్ కాలేజ్, కస్తూర్బా హాస్పిటల్ మణిపాల్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాలియేటివ్ కేర్ వంటి బహుళ భాగస్వాముల మద్దతుతో పనిచేయడానికి వ్యూహాత్మకంగా ప్రణాళిక చేయబడింది, ఇందులో శిక్షణ పొందిన పాలియేటివ్ మెడిసిన్ వైద్యులు, నర్సులు, మనస్తత్వవేత్తలు, సామాజిక కార్యకర్తలు, ఇతర సహాయక బృందం ఉంటుంది.
ఈ సందర్భంగా MAHE ప్రో-ఛాన్సలర్ డాక్టర్ హెచ్ఎస్ బల్లాల్ మాట్లాడుతూ, “జీవిత-పరిమిత పరిస్థితులను ఎదుర్కొంటున్న వారికి కరుణ, రోగి-కేంద్రీకృత సంరక్షణ అందించాలనే లక్ష్యంతో దీనిని ప్రారంభించాము. వైద్యం అనేది వ్యాధి నివారణ కోసం మాత్రమే కాకుండా మొత్తం వ్యక్తికి స్వస్థత కలిగించాలనే మా నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.
మణిపాల్‌లోని మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ ఛాన్సలర్, VSM (రిటైర్డ్) లెఫ్టినెంట్ జనరల్ (డాక్టర్) ఎండి వెంకటేష్ మాట్లాడుతూ, "భారతదేశంలో వైద్య కళాశాల మరియు టేరిషియరీ ఆసుపత్రి రెండింటితో అనుబంధించబడిన ఏకైక హాస్పిస్‌గా, భవిష్యత్ సంరక్షకులకు శిక్షణా స్థలంగా పనిచేస్తూనే అధునాతన పాలియేటివ్ కేర్‌ను అందించడానికి ఇది ప్రత్యేకంగా తీర్చిదిద్దబడింది" అని అన్నారు. హెల్త్ సైన్సెస్ ప్రో వైస్-ఛాన్సలర్ డాక్టర్ శరత్ కె. రావు, ప్రో వైస్-ఛాన్సలర్ (టెక్నాలజీ & సైన్స్) డాక్టర్ నారాయణ సభిత్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవిరాజా ఎన్ఎస్, MAHE రిజిస్ట్రార్ డాక్టర్ గిరిధర్ కిని, పాలియేటివ్ మెడిసిన్- సపోర్టివ్ కేర్ విభాగం ప్రొఫెసర్, అధిపతి డాక్టర్ నవీన్ సాలిన్స్, మణిపాల్ హాస్పిస్- రెస్పైట్ సెంటర్ (MHRC) డైరెక్టర్ డాక్టర్ సీమా రాజేష్ రావు కూడా ఈ సందర్భంగా మాట్లాడారు.