శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2019 (11:33 IST)

కేంద్ర ఐటీ శాఖలో ఉద్యోగాలు.. త్వరపడండి.. ఖాళీలెన్నో తెలుసా?

కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖలో ఉద్యోగవకాశాలున్నాయి. కానీ అవి కాంట్రాక్టు పోస్టులు. ఈ మేరకు యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులకు దరఖాస్తులను కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది. కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖలోని వేర్వేరు విభాగాల్లో 35 ఖాళీలున్నాయి. ఎంపికైన వారికి మూడు రోజుల శిక్షణ ఉంటుంది. 
 
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు ఢిల్లీలో పనిచేయాల్సి వుంటుందని.. వారి వేతనం 50వేలని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దరఖాస్తు చేయడానికి 2019 సెప్టెంబర్ 14 చివరి తేదీ. 
 
ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తుల్ని పోస్ట్ ద్వారా పంపాలి. విద్యార్హత: జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, విజువల్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ ఆర్ట్స్, ఎంబీఏ, యానిమేషన్ అండ్ డిజైనింగ్, లిటరేచర్, క్రియేటీవ్ రైటింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. వయోపరిమితి: 32 ఏళ్లలోపు.