నాణ్యమైన అంతర్జాతీయ ఉన్నత విద్యను పొందడంలో లభ్యత, స్థోమత అనేవి భారతీయ విద్యార్థులను వేధిస్తున్న రెండు ప్రధాన సవాళ్లు. విదేశాలలో చదువుకోవాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరగడంతో, ఇది సరికాని ఎంపికలకు కూడా దారి తీస్తుంది, తప్పుడు సమాచారం, మోసపూరిత ఏజెంట్లు విద్యార్థుల కుటుంబ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం తీసుకురావటంతో పాటుగా వారి భవిష్యత్తు అవకాశాలను సైతం అడ్డుకుంటున్నారు.
యుఎస్‌లో కూడా కార్యాలయాలు కలిగిన హైదరాబాద్‌కు చెందిన సంస్థ, గ్రాడ్‌రైట్, ఈ రంగంలో సమూల మార్పులను తీసుకువస్తుంది. ప్రపంచంలోని మొట్టమొదటి ఎడ్ -FinTech, AI-ఆధారిత SaaS పర్యావరణ వ్యవస్థ అయిన గ్రాడ్‌రైట్, తమ గ్లోబల్ ఫస్ట్ వ్యాపార నమూనాతో, సంభావ్య విద్యార్థులు, విశ్వవిద్యాలయాలు, రుణదాతలను సజావుగా ఒక వేదికపైకి తీసుకువస్తుంది. ShiftED 2023ని సమర్పిస్తుంది, ఇది ఉన్నత విద్యలో సంప్రదాయ సరిహద్దులను అధిగమించే ప్రత్యేక సమావేశం.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, సిటీ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్, విల్లమెట్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ కాలేజ్ పార్క్ వంటి యూనివర్శిటీల 30+ డీన్‌లు, అడ్మిషన్ డైరెక్టర్లను ఒకచోట చేరనున్నారు; MPOWER, Prodigy, Avanse, HDFC Credila, ICICI వంటి దేశీయ, అంతర్జాతీయ విద్యా రుణ ప్రదాతల CXOలు; అశోక విశ్వవిద్యాలయం, IIIT హైదరాబాద్ వంటి ప్రముఖ భారతీయ సంస్థల డీన్లు, వైస్ ఛాన్సలర్లు, ప్రొఫెసర్లు, భారతదేశం- విదేశాల నుండి నిపుణులు, ఆలోచనాపరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
విదేశాలలో ఉన్నత విద్యను పొందగోరే భారతీయ విద్యార్థుల అనుభవాలు పునర్నిర్వచించటానికి, పరిశ్రమ నాయకుల సహకారంతో విద్యార్థి-కేంద్రీకృత ఆవిష్కరణలను ప్రేరేపించటానికి వాగ్దానం చేసే అసాధారణ అనుభవం కోసం వేచి ఉండండి. రండి, ShiftED'23లో మీ భవిష్యత్తును అన్వేషించండి.
ఈవెంట్ వివరాలు:
తేదీ: ఆదివారం, డిసెంబర్ 3, 2023- సమయం: 10 AM - 7 PM, ప్రదేశం : JRC కన్వెన్షన్స్ & ట్రేడ్ ఫెయిర్స్, విస్పర్ వ్యాలీ పక్కన , జూబ్లీ హిల్స్, 4, నార్నే రోడ్, ఫిల్మ్ నగర్, హైదరాబాద్.