ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 14 మే 2017 (17:16 IST)

ఎస్‌ఆర్‌ఎం వర్శీటీలో బీటెక్ కౌన్సెలింగ్ ప్రారంభం.. టాపర్స్‌కు ఉచితం

చెన్నై నగరంలో ఉన్న ప్రముఖ డీమ్డ్ వర్శిటీలలో ఒకటైన ఎస్ఆర్ఎస్ విశ్వవిద్యాలయంలో 2017-18 విద్యా సంవత్సరానికి గాను బీటెక్ కౌన్సెలింగ్ ఆదివారం ప్రారంభమైంది. ఇది ఈనెల 22వ తేదీ వరకు జరుగనుంది. ఎస్ఆర్ఎం ఉమ్మడి

చెన్నై నగరంలో ఉన్న ప్రముఖ డీమ్డ్ వర్శిటీలలో ఒకటైన ఎస్ఆర్ఎస్ విశ్వవిద్యాలయంలో 2017-18 విద్యా సంవత్సరానికి గాను బీటెక్ కౌన్సెలింగ్ ఆదివారం ప్రారంభమైంది. ఇది ఈనెల 22వ తేదీ వరకు జరుగనుంది. ఎస్ఆర్ఎం ఉమ్మడి ప్రవేశ అర్హత పరీక్ష (ఎస్ఆర్ఎస్‌జేఈఈఈ)లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కౌన్సెలింగ్‌కు అర్హులు. ఆన్‌లైన్‌లో జరిగిన ఈ జేఈఈఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారు మొత్తం 121 పరీక్షా కేంద్రాల్లో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించారు.
 
ఈ పరీక్షకు ఉత్తరప్రదేశ్ నుంచి 7929 మంది, తమిళనాడు నుంచి 7298, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 6890, ఢిల్లీ నుంచి 4580 మంది విద్యార్థులతో పాటు.. ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా హాజరయ్యారు. వీరందరికీ కౌన్సెలింగ్ ప్రారంభంకాగా, ఈనెల 23వ తేదీ నుంచి ఎంటెక్ కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. 
 
ముఖ్యంగా, ఈనెల 12 నుంచి 23వ తేదీ ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ కార్నివాల్ జరుగనుంది. ఇందులో కాంచీపురం జిల్లాలోని కాంట్టాన్‌కుళత్తూరు క్యాంపస్‌కు ఆహ్వానించి, ఎస్ఆర్ఎం వర్శిటీలో ఉన్న వివిధ రకాలో సౌకర్యాలను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ఎస్ఆర్ఎం వర్శిటీ, దాని అనుబంధ క్యాంపస్‌లలో ఉన్న సౌకర్యాలను విద్యార్థులతో పాటు.. వారి తల్లిదండ్రులకు స్వయంగా తెలుసుకొని, తదునుగుణంగా వారు సరైన నిర్ణయం తీసుకునేందుకు ఈ కార్నివాల్ ఎంతగానో ఉపకరించనుంది.
 
కాట్టాన్‌కుళత్తూరుతో పాటు ఎస్ఆర్ఎం హర్యానా, ఎస్ఆర్ఎం అమరావతి, ఎస్ఆర్ఎం ఢిల్లీ క్యాంపస్‌లకు కూడా ఇక్కడే కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు.. తమకు ఇష్టమైన క్యాంపస్‌ను ఎంచుకోవచ్చు. ఇదిలావుండగా, ఎస్ఆర్ఎం జేఈఈఈ టెస్టులో టాప్ ర్యాంకర్లకు తొలి వందమందికి వంద శాతం ట్యూషన్‌తో పాటు.. హాస్టల్ ఫీజును మినహాయిస్తారు. కాగా, కౌన్సెలింగ్ ప్రారంభ రోజున ఎస్ఆర్ఎం వర్శిటీ చాన్సెలర్ డాక్టర్ పారివేందర్ పాల్గొని టాప్ ర్యాంకర్లతో పాటు.. అత్యుత్తమ ప్రదర్శనచూపిన విద్యార్థులకు ఫౌండర్స్ స్కాలర్‌షిప్‌లతో పాటు ఎంప్లాయీ వార్డ్ అవార్డులను ప్రదానం చేశారు.  
 
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డాక్టర్ పారివేందర్ మాట్లాడుతూ... అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు తమ వర్శిటీలో ఉన్నాయని, వీటిని విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు. ఇందుకోసం సరైన విద్యా సంస్థను ఎంచుకోవాలని సూచించారు. డిగ్రీ పట్టా అందుకోవడం ముఖ్యం కాదనీ, అది ఏ విద్యా సంస్థ నుంచి పొందారన్నదే ఇక్కడ ముఖ్యమన్నారు. గత 40 యేళ్లుగా తమ విద్యా సంస్థ సేవలు అందించడమే కాకుండా బహుభాషా, సంస్కృతి కలిగిన విద్యా సంస్థగా ఖ్యాతిగడించిందని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత టాప్ ర్యాంకర్లుగా నిలిచిన కె.హరిత, ఎస్‌పి.ప్రదీప్‌లకు ఆయన వంద శాతం ట్యూషన్, హాస్టల్ ఫీజును మినహాయిస్తూ సర్టిఫికేట్‌ను ప్రదానం చేశారు. అలాగే, ఏ.అక్షయ, సాయి కృతిక, సాయిరాం, శివరాం, అజిత్, మునీశ్వర్, తమిళ్‌మణిలకు కూడా వివిధ రకాల అవార్డు సర్టిఫికేట్లను ప్రదానం చేశారు.
 
అంతకుముందు.. ఎస్ఎర్ఎం అమరావతి క్యాంపస్ ప్రొచాన్సెలర్ ప్రొఫెసర్ డి.నారాయణ రావు మాట్లాడుతూ... ఏపీ నూతన రాజధాని అమరావతిలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఆర్ఎం క్యాంపస్‌ను నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఇందుకోసం రూ.3 వేల కోట్ల మేరకు పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపారు. వచ్చే మూడేళ్ళలో ఈ క్యాంపస్‌ను దశలవారీగా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.