శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 14 మార్చి 2023 (23:50 IST)

విదేశీ విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులకు ఆర్ధిక సహాయం అందించిన వియ్‌ మేక్‌ స్కాలర్స్‌ స్టడీ ఎబ్రాడ్‌ ఫండింగ్‌ ఎక్స్‌పో

Students
వియ్‌ మేక్‌ స్కాలర్స్‌ ఇటీవల భారతదేశంలో అతి పెద్ద స్టడీ ఎబ్రాడ్‌ ఫండింగ్‌ ఎక్స్‌పో(సేఫ్‌)ను బేగంపేటలోని మనోహర్‌ హోటల్‌లో నిర్వహించింది. తల్లిదండ్రులు, విద్యార్ధుల నుంచి ఈ ఎక్స్‌పోకు అపూర్వమైన స్పందన లభించింది. విదేశీ విద్యకు సంబంధించి విద్యార్ధులకు సమగ్రమైన మార్గనిర్దేశకత్వమూ ఇక్కడ లభించింది. ఆర్థిక అవరోధాల కారణంగా ఏ ఒక్కవిద్యార్ధీ తమ విదేశీ విద్య కలను వదులుకోకూడదనే లక్ష్యంతో సేఫ్‌ 2023ను వియ్‌ మేక్‌ స్కాలర్స్‌ నిర్వహించింది. విద్యార్ధులకు  అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌లను అన్వేషించే అవకాశం లభించడంతో పాటుగా అతి తక్కువ వడ్డీ రేట్లకు విద్యా ఋణాలను పలు బ్యాంకుల నుంచి పొందే అవకాశం సైతం లభించింది. విద్యార్ధులు తమ ప్రొఫైల్‌కు అనుగుణంగా ముఖాముఖి మార్గనిర్దేశకత్వం సైతం పొందారు.
 
వియ్‌ మేక్‌ స్కాలర్స్‌ నిర్వహించిన ఈ స్టడీ ఎబ్రాడ్‌ ఫండింగ్‌ ఎక్స్‌పో 2023కు దాదాపు 2వేల మందికి పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌లు, విద్యా ఋణాలపై దృష్టి సారించి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం తమకెంతో ఉపయోగపడిందని విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేశారు. వియ్‌ మేక్‌ స్కాలర్స్‌సేవలన్నీ ఉచితం. ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వ ఐటీ మంత్రిత్వ శాఖ తమ డిజిటల్‌ ఇండియా ప్రచారంలో భాగంగా మద్దతు అందిస్తుంది.
 
వియ్‌ మేక్‌ స్కాలర్స్‌ కో ఫౌండర్‌ దామిని మహాజన్‌ మాట్లాడుతూ విదేశీ విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులకు ఫండింగ్‌ సమస్యను తీర్చడం ఈ ఎక్స్‌పో ప్రధాన లక్ష్యం. దాదాపు 1000 మంది విద్యార్థులకు  సూత్రప్రాయంగా విద్యా ఋణాలను మంజూరు చేయడం జరిగింది. ఒకే రోజు ఇంతమందికి ఋణాలను మంజూరు చేయడం ఓ రికార్డు అని అన్నారు.