గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 ఫిబ్రవరి 2024 (12:59 IST)

ఇస్రోలో టెక్నీషియన్ - టెక్నికల్ ఉద్యోగాలు - ఇలా దరఖాస్తు చేసుకోవాలి..

isro logo
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో టెక్నీషియన్, టెక్నీకల్ అసిస్టెంట్ సహా వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీలు చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న యువతకు ఇది శుభవార్త. ఈ నోటిఫికేషన్‌లో దాదాపు 224 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులు యూఆర్ రావు శాటిలైన్ సెంటర్, ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌ల్లో పని చేయాల్సి ఉంటుంది. 
 
ఈ పోస్టుల వివరాలను... సైంటిస్ట్​/ఇంజినీర్ 5 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ 55 పోస్టులు, సైంటిఫిక్​ అసిస్టెంట్ 6 పోస్టులు, లైబ్రరీ అసిస్టెంట్ 1 పోస్టు, టెక్నీషియన్​-బీ/డ్రాఫ్ట్స్​మ్యాన్​-బీ 42 పోస్టులు, ఫైర్​మ్యాన్​-ఏ 3 పోస్టులు, కుక్ 4 పోస్టులు, లైట్​ వెహికల్​ డ్రైవర్​-ఏ 6 పోస్టులు, హెవీ వెహికల్ డ్రైవర్-ఏ 2 పోస్టులు ఇలా మొత్తం 224లు ఉన్నాయి. మెకాట్రానిక్స్​, మెటీరియల్ సైన్స్, మ్యాథమెటిక్స్​, ఫిజిక్స్​, ఎలక్ట్రికల్, ఎలక్ట్రీషియన్​, ఫిట్టర్​, ప్లంబర్​, టర్నర్​, కార్పెంటర్​, వెల్డర్ వంటి విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. 
 
అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి 10వ తరగతి, ఇంటర్​ సహా, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డ్రైవర్ పోస్టులకు డ్రైవింగ్ లైసెన్స్​, పని అనుభవం కూడా ఖచ్చితంగా ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు సైంటిస్ట్​/ఇంజినీర్ 18 - 30 ఏళ్లు, టెక్నికల్ అసిస్టెంట్ 18 - 35 ఏళ్లు, సైంటిఫిక్​ అసిస్టెంట్ 18 - 35 ఏళ్లు, లైబ్రరీ అసిస్టెంట్ 18 - 35 ఏళ్లు, టెక్నీషియన్​-బీ/డ్రాఫ్ట్స్​మ్యాన్​-బీ 18 - 35 ఏళ్లు, ఫైర్​మ్యాన్​-ఏ 18 - 25 ఏళ్లు, కుక్ 18 - 35 ఏళ్లు, లైట్​ వెహికల్​ డ్రైవర్​-ఏ 18 - 35 ఏళ్లు, హెవీ వెహికల్ డ్రైవర్-ఏ 18 - 35 ఏళ్లు ఉండాలి. 
 
టెక్నికల్ అసిస్టెంట్​, సైంటిఫిక్ అసిస్టెంట్, సైంటిస్ట్​, ఇంజినీర్ పోస్టులకు అప్లికేషన్ ఫీజుగా రూ.250, ప్రాసెసింగ్ ఫీజుగా రూ.750 చెల్లించాలి. అయితే ప్రాసెసింగ్ ఫీజును తరువాత రీ-ఫండ్ చేస్తారు. టెక్నీషియన్-బీ, డ్రాఫ్ట్స్​మ్యాన్​-బీ, కుక్​, ఫైర్​మ్యాన్-ఏ, లైట్​ వెహికల్​ డ్రైవర్​-ఏ, హెవీ వెహికల్ డ్రైవర్-ఏ పోస్టులకు రూ.500 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. దీనిలో రూ.100 రీ-ఫండ్ చేస్తారు. 
 
అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష/కంప్యూటర్ బేస్డ్​ టెస్ట్ నిర్వహిస్తారు. దీనిలో ఉత్తీర్ణులైన వారికి స్కిల్​ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. వీటన్నింటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా ఇస్రో అధికారిక వెబ్​సైట్​ https://www.isro.gov.in/ ఓపెన్ చేయాలి.
 
ఆన్​లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ : 2024 ఫిబ్రవరి 10
ఆన్​లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 మార్చి 3