శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 సెప్టెంబరు 2021 (13:04 IST)

కులలా వారీగా జనగణన చేపట్టాలి : 'ద్రావిడ దేశం' కృష్ణారావు

కులాల వారి జన గణన కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని సోమవారం చెన్నై సైదాపేట‌లో జరిగిన అనేక వెనుకబడిన మరియు అత్యంత వెనుకబడిన కులాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్న ధర్నా కార్యక్రమంలో పాల్గొని ద్రావిడ దేశం అధ్యక్షుడు వి.కృష్ణారావు డిమాండ్ చేశారు. 
 
బ్రిటిష్ ప్రభుత్వంలో చివరగా 1931 వ సంవత్సరం కులాల వారి జన గణన జరిగిందని, ఆ తర్వాత స్వాతంత్ర్యం వచ్చిన పిదప కేంద్రంలో అనేక ప్రభుత్వాలు మారినా ఇప్పటివరకు కులాల వారి జన గణన జరగలేదని గుర్తుచేశారు. మండల్ కమిషన్ ప్రకారం రిజర్వేషన్లు సక్రమంగా అమలు పరచడం లేదని, తత్ఫలితంగా అనేక వెనుకబడిన వర్గాల కులాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అనేక పథకాలు వారు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
2011 వ సంవత్సరంలో కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి కులాల వారి జన గణన జరిగిందని కానీ వివరాలను మాత్రం ప్రభుత్వాలు బహిర్గతం చేయలేన్నారు. దేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీలు కులాల వారి జన గణన జరగాలని అనేకసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించినా ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ మంత్రులు సైతం పార్లమెంటులో ప్రసంగించేటప్పుడు భారతదేశంలో కుల గణన చేసే ఆలోచన లేదని చెప్పడం జరిగిందని, ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. 
 
ప్రభుత్వంలోని అనేక పథకాలు బడుగు బలహీన వర్గాలకు సక్రమంగా చేరి వారి సముదాయం ప్రగతి పథంలో అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా అన్ని వర్గాల ప్రజలను నేరుగా కలిసి  కచ్చితంగా కులాల వారిగా జనగణన చేయాల్సిందేనని కృష్ణారావు డిమాండ్ చేశారు. ఆల్రెడీ ఇంతకు క్రితమే ఎస్సీలకు ఎస్టీలకు కులాల వారిగా జనగణన జరిపిన విధంగానే వెనుకబడిన మరియు అత్యంత వెనుకబడిన కులాల వారికి కూడా జన గణన జరగాలన్నారు. 
 
తమిళనాడు రాష్ట్రంలో ప్రతిభగల ఏ కులం వారైనా దేవాలయాల్లో అర్చకులుగా నియమించవచ్చని అమలు పరిచిన ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని కృష్ణారావు అన్నారు. సామాజిక న్యాయం కొరకు పెరియార్ మార్గంలో నడుస్తున్న డీఎంకే ప్రభుత్వం  ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించవలసినదిగా కృష్ణారావు ఈ సందర్భంగా కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో విడుదల చిరుతైగళ్ పార్టీ అధినేత పార్లమెంట్ సభ్యులు తిరుమావళవన్, తమిళనాడు యాదవ సమాజం, అనేక కార్మిక సంఘాలు, కుమ్మరి , మత్స్యకారుల సంఘాల నాయకులు మరియు అనేక సంఘాల తరఫున అనేక మంది పాల్గొని విజయవంతం చేశారు.