బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (02:58 IST)

ఆదివారమూ అదే గొడవే...గవర్నర్ ముందుకు అసెంబ్లీ పంచాయితీ

తమిళనాడు రాజకీయ సంక్షోభానికి తెరపడినా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. ఆదివారం ఇరు పార్టీల నాయకులు గవర్నర్‌ విద్యాసాగర్‌ రావును కలసి ఒకరిపై మ రొకరు ఫిర్యాదు చేసుకున్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీలో

తమిళనాడు రాజకీయ సంక్షోభానికి తెరపడినా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోరాటాన్ని  కొనసాగిస్తున్నాయి. ఆదివారం ఇరు పార్టీల నాయకులు గవర్నర్‌ విద్యాసాగర్‌ రావును కలసి ఒకరిపై మ రొకరు ఫిర్యాదు చేసుకున్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీలో జరిగిన పరిణామాలను వివరించారు. కాసేపటి తర్వాత డీఎంకే ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలసి అధికార పార్టీ తీరుపై ఫిర్యాదు చేసింది. అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్యెల్యేలపై జరిగిన దౌర్జన్యంపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేశామని, పరి శీలిస్తానని ఆయన హామీ ఇచ్చారని డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ చెప్పారు. ప్రతిపక్ష పార్టీలను బయటకు గెంటి బలపరీక్షలో ముఖ్యమంత్రి గెలవడం చట్టవిరుద్ధమని అన్నారు.
 
శాసనసభలో శనివారం జరిగిన కార్యకలాపాలను రద్దు చేయాలని డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంకే స్టాలిన్‌ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాల సభ్యులు లేకుండానే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారని సభలో విపక్ష నాయకుడు కూడా అయిన ఆయన పేర్కొన్నారు. శనివారం తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్బంగా రణరంగాన్ని తలపించిన సంగతి తెలిసిందే.

డీఎంకే సభ్యులు కుర్చీలు, మైకులు విరగ్గొట్టి స్పీకర్‌ ధనపాల్‌పై విసిరివేశారు. సభ రెండుసార్లు వాయిదా పడిన అనంతరం స్పీకర్‌ డీఎంకే ఎమ్మెల్యేలను బయటకి పంపి ఓటింగ్‌ ప్రక్రియను పూ ర్తి చేశారు. ఇదిలా ఉంటే స్వామిని బలపర్చినందుకు తనకు బెది రింపులు వస్తున్నాయని కోయంబత్తూరు ఎమ్మెల్యే అమ్మన్‌ అర్జునన్‌ ఆరోపించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి దుర్భాషలాడారని చెప్పారు.