1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 మే 2022 (08:46 IST)

చెన్నైలో అందుబాటులోకి వచ్చిన "ఐను" ఆస్పత్రి సేవలు

AINU team
హైదరాబాద్ కేంద్రంగా అత్యుత్తమైన వైద్య సేవలు అందిస్తూ వస్తున్న ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఐను) ఆస్పత్రిని చెన్నైలో కూడా అత్యాధునిక వైద్య సదుపాయాలతో నెలకొల్పారు. ఈ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం తాజాగా నగరలో జరిగింది. ఇందులో తమిళనాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఎం.సుబ్రహ్మణ్యం, మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్‌లు కలిసి ప్రారంభించారు. ఈ వేడుకలో 'పద్మ భూషణ్ పురస్కార గ్రహీత, ఏఐజీ చైర్మెన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి, ఇతర వైద్యులు పాల్గొన్నారు. 
 
చెన్నై నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఒకటిగా ఈ ఆస్పత్రిలో సదుపాయాలను కల్పించారు. ముఖ్యంగా, ప్రత్యేకించి కిడ్నీ సంబంధిత సమస్యలు, యూరాలజీ వ్యాధులకు ప్రత్యేకంగా ఇక్కడ చికిత్స అందిస్తారు. ఈ తరహా ఆస్పత్రిని చెన్నైలో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఐను హాస్పిటల్ హైదరాబాద్ నగరంలో అద్భుతంగా తన సేవలను అందిస్తూ మంచి పేరును గడించింది.
AINU team 1
 
ఇపుడు చెన్నైలో 100 పడకల ఆస్పత్రిగా స్థాపించారు. ఇందులో లేజర్ లిథోట్రిప్సీ, అడ్వాన్స్ ఎండో యూరాలజీ, రీకన్‌స్ట్రైవ్ యూరాలజీ, ఆండ్రాలజీ, ఫీమేల్ యూరాలజీ, యూరో-ఆంకాలజీ, రెనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్, హెచ్‌డీఎఫ్ హీమో డయాలసిస్, మల్టీ స్లైస్ సీటీ స్కాన్, అడ్వాన్సడ్ లాప్రోస్కోపీ తదితర అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. 
 
ఇక్కడ కిడ్నీ, మూత్ర సంబంధిత వ్యాధులకు ప్రత్యేకంగా అత్యాధునిక టెక్నాలజీతో నిపుణులతో కూడిన వైద్య బృందం చికిత్స చేయనుంది. ఇలాటి వాటిలి సింగిల్ యూజ్ డయాలసిస్ ఒకటి. ఈ సందర్భంగా చెన్నై ఐను ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సి.మల్లిఖార్జున, తదితరులు విలేకరులతో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే ధరలతో అత్యున్నత టెక్నాలజీతో మెరుగైన నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు కట్టుబడివున్నట్టు చెప్పారు. ఈ ఆస్పత్రిని స్థానిక నుంగంబాక్కంలోని తిరుమూర్తి మెయిన్ రోడ్డులో నెలకొల్పారు.