శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. కాంటినెంటల్
Written By
Last Updated : బుధవారం, 30 జనవరి 2019 (11:36 IST)

ఓట్స్ సూప్ ఎలా చేయాలి..?

కావలసిన పదార్థాలు:
ఓట్స్ - 3 స్పూన్స్
బీన్స్ - పావుకప్పు
క్యారెట్ 2
పచ్చి బఠాణీలు - పావుకప్పు
స్వీట్‌కార్న్ - పావుకప్పు
పాలు - అరకప్పు
పెప్పర్ - అరస్పూన్
ఉప్పు - సరిపడా
చక్కెర - పావుస్పూన్
కొత్తిమీర - అరస్పూన్.
 
తయారీ విధానం:
ముందుగా కప్పు నీటిలో క్యారెట్, బీన్స్ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. మరో బాణలిలో అరకప్పు నీరు పోసి క్యారెట్, బీన్స్‌తో పాటు బఠాణీలు, స్వీట్‌కార్న్ వేసి 5 నిమిషాలు అలానే ఉంచాలి. ఆ తరువాత ఓట్స్ వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు పెప్పర్, ఉప్పు, చక్కెర వేసి నిమిషం తరువాత పాలు కలిపి దించేయాలి. చివరగా కొత్తిమీర చల్లి తీసుకుంటే.. ఎంతో రుచిగా ఉండే ఓట్స్ సూప్ రెడీ.