సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 జనవరి 2022 (10:43 IST)

వామ్మో కరోనా వైరస్ కేసులు... తగ్గేదే లే అంటున్న వైరస్

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వైరస్ తర్వాత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. 
 
నిజానికి గత 10 రోజుల క్రితం దేశంలో కేవలం 50 వేలలోపు మాత్రమే పాజిటివ్ కేసులు నమోదవుతూ వచ్చాయి. కానీ, ఇపుడు ఈ కేసుల సంఖ్య లక్షన్నర దాటిపోయింది. గడిచిన 24 గంటల్లోనే ఏకంగా 1,79,723 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ బారినపడినవారిలో 146 మంది చనిపోయారు. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 7,23,619 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 4033కు చేరుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి మన్సుక్ మాండవీయ సోమవారం అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.