1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 జనవరి 2022 (10:51 IST)

#NRIDay జనవరి 9న ఎందుకు జరుపుకుంటారు?

ప్రతియేటా జనవరి 9వ తేదీ ఎన్.ఆర్.ఐ. డేను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రవాస భారతీయుల దినోత్సవంగా పిలిచే ఈ ఎన్ఆర్ఐ డేను... 1915 సంవత్సరంలో దక్షిణాఫ్రికా నుంచి మహాత్మా గాంధీ భారత్‌కు తిరిగి వచ్చినప్పటి నుంచి జనవరి 9వ తేదీన జరుపుకుంటూ వస్తున్నారు. 
 
అయితే, గత 2003 నుంచి ప్రతి యేటా ఒక భారతీయ నగరంలో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేషంగా, ప్రశంసనీయంగా కృషి చేసిన ప్రవాస భారతీయులకు భారత రాష్ట్రపతి ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారాలను అందజేస్తుంటారు. ముఖ్యంగా, ప్రవాస భారతీయుల నైపుణ్యాలు, సేవలను భారతదేశం ప్రోత్సహించేలా, అందుకు తగిన పరిస్థితులు కల్పించాలా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. 
 
1990లో సాఫ్ట్‌వేర్ రంగం శరవేగంగా వృద్ధి చెందింది. ఆమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి అనేతి అనేక మంది భారతీయులను ఆకర్షించింది. ఫలితంగా అనేక మంది భారతీయులు ఆ దేశానికి వలస వెళ్లారు ప్రస్తుతం భారతీయుల అత్యధికసంఖ్యలో ఉన్న దేశాల్లో అమెరికా మూడో స్థానంలో ఉంది. వివిధ కారణాల వల్ల ఇలా వలస వెల్లిన వారు ప్రవాస భారతీయులు. 
 
ఆయా దేశాల్లో స్థిరపడిన భారత సంతతి వారు అందరూ కలిసి దాదాపు 30 మిలియన్ వరకూ వివిధ దేశాల్లో ప్రవాస భారతీయులు ఉన్నారు. అయితే, ప్రవాస భారతీయులను మాత్రం దేశాభివృద్ధి భాగస్వాములు చేయడంలో మాత్రం దేశీయంగా ఇంకా మెరుగైన పరిస్థితులు కల్పించలేకపోతున్నారు.