1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 ఏప్రియల్ 2021 (17:38 IST)

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్.. రక్తం గడ్డకట్టింది.. ఏడుగురు మృతి

AstraZeneca
యూకేకు చెందిన మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ఓ ప్రకటనలో మార్చి 24న తేదీ నుంచి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న 30 మందిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఈ 30మంది ఆస్ట్రాజెనెకా తీసుకున్న తర్వాత రక్తం గడ్డ కట్టింది. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత రక్తం గడ్డకట్టిన 30 మందిలో ఏడుగురు మరణించినట్లు యుకె మెడికల్ రెగ్యులేటర్ శనివారం తెలిపింది.
 
ఇప్పటికే మహిళల్లో ఇదే తరహా ఐదు కొత్త కేసులు నమోదైన తర్వాత 60 ఏళ్లలోపు వారికి ఆస్ట్రాజెనెకా జబ్‌తో టీకాలు వేయడాన్ని నెదర్లాండ్స్ శుక్రవారం నిలిపివేసింది. వారిలో ఒకరు మరణించారు. ఈ వారం ప్రారంభంలో జర్మనీ ఇలాంటి నిర్ణయం తీసుకుంది.
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను సురక్షితంగా ప్రకటించిన యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ), ఈ సమస్యపై ఏప్రిల్ 7న నవీకరించబడిన సలహాలను ప్రకటించనుంది. 
 
టీకా సురక్షితంగా ఉందని, వయస్సు, లింగం లేదా వైద్య చరిత్ర వంటి నిర్దిష్ట ప్రమాద కారకాలను నిపుణులు కనుగొనలేదని ఈఎంఏ తెలిపింది. చాలా సందర్భాలలో ఈ టీకా వాడిన వారిలో రక్తం గడ్డకడుతోందని.. తెలియవచ్చింది. అయితే ఫైజర్ అండ్ బయోఎంటెక్ వ్యాక్సిన్ నుండి రక్తం గడ్డకట్టినట్లు ఎటువంటి నివేదికలు లేవు.