సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By శ్రీ
Last Modified: శనివారం, 2 మే 2020 (20:50 IST)

కరోనా భయంతో మేడపై నుంచి దూకేశాడు, ప్రాణాలు కోల్పోయాడు

కరోనా వైరస్ భయంతో మానసిక అందోళన చెందిన ఓ వ్యక్తి బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రామంతాపూర్‌లో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు విఎస్ అపార్టుమెంటులోని ప్లాట్ నెంబర్ ౩౦౩లో నివసించే వాసిరాజు కృష్ణ మూర్తి (60) కొద్ది కాలంగా గ్యాస్ సమస్యతో అవస్థ పడుతున్నాడు.
 
తరచూ ఆయాసం రావడంతో కరోనా సోకిందేమో అని ఆందోళన చెందాడు. దీనితో కుటుంబ సభ్యులు కింగ్ కోఠి ఆసుపత్రికి తీసుకువెళ్లగా కరోనా లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు. 
 
అయినప్పటికీ ఆయన ఆందోళన చెందుతుండటంతో శనివారం గాంధీ అసుపత్రికి వెళదామని కుటుంబ సభ్యులు రెడీ అవుతున్న తరుణంలో అపార్టుమెంటు తన ప్లాట్ బాల్కనీ నుంచి కిందకు దూకడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనితో ఉప్పల్ పొలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అసుపత్రి మార్చురీకి తరలించారు.