శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 ఆగస్టు 2020 (13:55 IST)

క్షీణించిన అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం.. నాగ్‌పూర్‌కు తరలింపు

సినీనటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించగా నాగ్‌పూర్‌లోని దవాఖానకు తరలించారు. నవనీత్‌ కౌర్‌ సహా కుటుంబంలోని 12 మంది మహమ్మారి బారినపడ్డారు. ఇటీవల ఆమె పాజిటివ్‌గా పరీక్షించడంతో చికిత్స కోసం అమరావతి దవాఖానలో చేరారు. కానీ చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో నాగ్‌పూర్‌లోని ఓఖార్డ్ హాస్పిటల్‌లో చేరారు. 
 
నవనీత్ కౌర్ భర్త రవి రానాకు ఆగస్టు 6న కరోనా పాజిటివ్‌గా తేలింది. తరువాత కుటుంబంలోని మొత్తం 12 మంది సభ్యులు ఈ వైరస్ బారిన పడ్డారు. ఇందులో నవనీత్ కౌర్ పిల్లలు, అత్తమామలు కూడా ఉన్నారు. నవనీత్‌ కౌర్‌ తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. కొద్ది రోజుల కిందట రవి రానాను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
గత పార్లమెంట్‌ ఎన్నికల్లో అమరావతి నియోజకవర్గం నుంచి ఎంపీగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. శివనసేన ఎంపీ ఆనందరావును భారీ తేడాతో ఓడించారు. నవనీత్ కౌర్ భర్త, యువ స్వాభిమాన్ పార్టీ నాయకుడు. రవి రానా బద్నేరా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.