ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 మే 2023 (22:24 IST)

చైనాలో కరోనా వైరస్ విజృంభణ.. జూన్‌లో తారాస్థాయికి..

covid vaccine
చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఆ వేరియంట్ కేసులు జూన్ నెల‌లో తారాస్థాయికి చేరే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. చైనాలో ప్ర‌స్తుతం వారానికి దాదాపు 65 మిలియ‌న్ల మందికి కొత్తగా వైర‌స్ సోకే ప్ర‌మాదం ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. 
 
జీరో కోవిడ్ పాల‌సీ నుంచి ఇటీవ‌ల చైనా ఫ్రీ అయిన విష‌యం తెలిసిందే.ఈ నేప‌థ్యంలో వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రాను పెంచేసింది. ఎక్స్‌బీబీ ఒమిక్రాన్ స‌బ్‌వేరియంట్లు అయిన ఎక్స్‌బీబీ.1.9.1, ఎక్స్‌బీబీ.1.5, ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ల కోసం కొత్త వ్యాక్సిన్లు రానున్నాయి.