శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్

చైనాను అధికమించిన భారత్ .. ఏ విషయంలో?

indo - china
చైనాను భారత్ అధికమించింది. మొత్తం జనాభాలో చైనాను భారత్ వెనక్కి నెట్టేసింది. ప్రస్తుతం చైనా జనాభా 142.57 కోట్లు ఉండగా, భారత్ జనాభా 142.86 కోట్లకు చేరింది. దీనికి కారణం లేకపోలేదు. గత కొంతకాలంగా చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గింది. జనభా నియంత్రణ చర్యల్లో భాగంగా, ఆ దేశ పాలకులు చేపట్టిన చర్యల కారణంగా చైనాలో జననా రేటు తగ్గింది. 
 
1950 నుంచి జనాభా లెక్కలను ఐక్యరాజ్య సమితి సేకరిస్తూ వస్తుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో చైనానే అగ్రస్థానంలో ఉంటూ వచ్చింది. ఇపుడు చైనాను భారత్ వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని ఆక్రమించింది. చైనాలో చాలా కాలంగా జననాల రేటు భారీగా పడిపోయింది. జనాభా తగ్గిపోతూ, వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండటంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. 
 
పిల్లను కనాలంటూ ఆ దేశ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నప్పటికీ ఫలితం దక్కలేదు. అక్కడి ప్రజల్లో చాలా మంది పిల్లన్ని కనడానికి ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఐక్యరాజ్య సమితి వెల్లడించిన వివరాల మేరకు.. భారత్ జనాభాలో నాలుగో వంతు 14 యేళ్ల లోపు పిల్లలే. ఇక 68 శాతం జనాభా 15 - 16 యేళ్ల వయసు మధ్యస్కులే కాగా, 65 యేళ్ల పైబడిన వారు 7 శాతం మంది ఉన్నారు.