మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 5 మే 2023 (08:01 IST)

ప్రపంచ ఆర్థిక సదస్సుకు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం

ktrao
చైనాలోని టియాంజన్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు(వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్) జరునుంది. జూన్ 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం వచ్చింది. 
 
ఈ సదస్సుకు హాజరుకావాలని డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బోర్గె బ్రెండే ఆహ్వానం పంపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రం కొత్త ప్రణాళికలు, సాంకేతికతతో ప్రగతి పథంలో దూసుకెళుతుందని బోర్గె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.