శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By జె
Last Modified: సోమవారం, 16 మార్చి 2020 (22:08 IST)

కరోనా ఎఫెక్ట్, తిరుమల ఖాళీ.. దర్సనం ఎంతసేపట్లో అవుతుందో తెలిస్తే షాకే

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఎఫెక్ట్‌తో అగ్రరాజ్యాలు వణికిపోతున్నాయి. తెలంగాణా రాష్ట్రంలో అయితే స్కూళ్ళు, థియేటర్లు పూర్తిగా మూతబడ్డాయి. తెలంగాణా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. 
 
ఎపిలోను ప్రభుత్వం అలెర్ట్‌గానే ఉన్నా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఆలయం తిరుమలలో ఉండటంతో అటు టిటిడి, ఇటు ప్రభుత్వం ఆలోచనలో పడింది. విదేశీ భక్తులు తిరుమలకు వస్తుండటం ఇక్కడి స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది.
 
అయితే తిరుమలకు ఎక్కువగా ఫ్లోటింగ్ ఉండే తమిళనాడు రాష్ట్రం నుంచి అయితే భక్తుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టింది. ఇక కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చే వారి సంఖ్య మరింత తగ్గిపోయింది. దీంతో తిరుమలగిరులు ఖాళీగా కనిపిస్తున్నాయి. కేవలం అరగంటలో తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం లభిస్తోంది. గతంలో ఈ విధంగా ఎప్పుడూ లేదంటున్నారు టిటిడి అధికారులు. పరీక్షా సమయంలో మాత్రమే రద్దీ తక్కువగానే ఉంటుందని.. అయితే కరోనా ఎఫెక్ట్‌తో తిరుమలకు భక్తుల రాక తగ్గుతోందన్న అభిప్రాయాన్ని టిటిడి అధికారులు వ్యక్తం చేస్తున్నారు.