అలాంటి వారికి కరోనా వైరస్ చాలా త్వరగా వ్యాపిస్తుంది...

corona virus alert
ఐవీఆర్| Last Modified శుక్రవారం, 20 మార్చి 2020 (14:17 IST)
కరోనా వైరస్ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. మన దేశంలో ఇప్పటివరకూ 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రమాదకర కరోనా వ్యాధి లక్షణాలు, నియంత్రణ ఎలాగో చూద్దాం.

1. ప్రారంభంలో జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వుంటుంది.

2. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.

3. న్యుమోనియా, ఆస్త్మా వ్యాధులతో ఇబ్బందిపడేవారికి త్వరగా వ్యాపించే అవకాశం ఎక్కువ.

4. వ్యాధి సోకిన వ్యక్తుల వల్ల కానీ, పక్షి, జంతువుల ద్వారా కానీ రావచ్చు.

5. కరోనా వైరస్ నియంత్రించేందుకు ఇప్పటివరకూ ఔషధం కనుగొనబడలేదు కాబట్టి ఆ వైరస్ రాకుండా జాగ్రత్త పడాల్సిందే.
corona virus precautions

వైరస్ సోకకుండా ఏం చేయాలి?
1. సబ్బు నీటితో చేతులు తరచుగా శుభ్రం చేసుకోవాలి. కనీసం 20 సెకన్ల పాటు మోచేతుల వరకూ రుద్దు కడుక్కోవాలి.

2. దగ్గు, తుమ్ముతున్నప్పుడు ముక్కు, నోటిని హ్యాండ్ ఖర్చీఫ్ లేదా టిష్యూ పేపర్ లేదా టవల్‌తో కవర్ చేసుకోవాలి. ఇలా వాడిన వాటిని డెట్టాల్‌తో శుభ్రంగా ఉతకాలి. టిష్యూ పేపర్ వాడితే దాన్ని మూత వున్న డస్ట్ బిన్లో వేయాలి.

3. బయటకు వెళ్లి వచ్చినప్పుడు కానీ స్నేహితులు, బంధువుల ఇళ్లకు వెళ్లిన తర్వాత కడుక్కోని చేతులతో కళ్ళు, ముక్కు లేదా నోటిని తాకవద్దు.

4. ఎవరైనా జ్వరంతో బాధపడుతుంటే వారు ఉపయోగించే వస్తువులు, దుస్తులు వాడటం చేయకూడదు.

5. వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసిన ప్రాంతాలకు వెళ్లడం మానుకోవాలి, ఎవరైనా జ్వరం లేదా దగ్గు వంటి లక్షణాలను గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.



దీనిపై మరింత చదవండి :