కరోనాపై పోరాటం టెస్ట్ క్రికెట్ లాంటిది.. సచిన్ టెండూల్కర్
ప్రపంచ మహమ్మారి కరోనాపై పోరాటం టెస్ట్ క్రికెట్ లాంటిదని క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వెల్లడించాడు. టెస్ట్ క్రికెట్ ఆడాలంటే ఎంతో సహనం, టీమ్ వర్క్ ఉండాలని... డిఫెన్స్ ఎంతో ముఖ్యమని అలాగే కరోనాపై గెలవాలంటే.. తప్పకుండా ఓపిక కావాలన్నాడు.
మనకు అర్థంకాని, అంతుచిక్కని దాన్ని గౌరవించడమనేది టెస్ట్ క్రికెట్లో ఒక ప్రధాన అంశమని సచిన్ చెప్పారు. ముఖ్యంగా సహనం అనేది టెస్ట్ క్రికెట్లో కీలకమని తెలిపాడు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో... ప్రస్తుతం మనకు అదే సహనం అవసరమని సూచించాడు. కరోనాను కూడా మనం టెస్ట్ మ్యాచుల్లో మాదిరే డిఫెన్స్‌తో ఎదుర్కొందామని చెప్పారు.
కరోనాను అన్ని దేశాలు కలిసికట్టుగా ఎదుర్కోవాలని అన్నారు. పొట్టి క్రికెట్‌కు ఆటగాడి వ్యక్తిగత నైపుణ్యం ప్లస్ పాయింట్ అని... అదే టెస్టుల విషయానికొస్తే పార్ట్ నర్ షిప్, టీమ్ వర్క్ చాలా ముఖ్యమని సచిన్ తెలిపారు.