గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2020 (11:17 IST)

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. ఒక్కరోజే 83వేలు

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. బుధవారం కొత్తగా 83,883 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో భారత్‌లో కరోనా కేసులు 38 లక్షలు దాటాయి.

ఇక బుధవారం కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 38,53,407కు చేరింది. బుధవారం ఒక్కరోజే 1,043 మంది కరోనాకు బలయ్యారు.
 
దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 67,376కి చేరింది. మొత్తం బాధితుల్లో సుమారు 29 లక్షల మందికి పైగా కోలుకోగా 8 లక్షల మందికి పైగా చికిత్స పొందుతున్నారు.

దేశవ్యాప్తంగా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు భారీగా చేపట్టడంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ చెబుతోంది. ప్రస్తుతం 8,15,538 యాక్టివ్ కేసులు ఉన్నాయి.