కొత్త కోవిడ్ -19 కేసులలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్లలో ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. ఈ రాష్ట్రాలలోనే మొత్తం కేసులలో 84.73% నమోదవుతున్నాయని వెల్లడించింది. గత 24 గంటల్లో భారతదేశంలో కొత్తగా 53,480 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,21,49,335 కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంగళవారం 354 మరణాలు నమోదయ్యాయి, డిసెంబర్ 16 నుండి అత్యధికంగా మరణించిన వారిలో 140 మంది మహారాష్ట్ర నుండి మరణించారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 1,62,468గా ఉంది. కర్ణాటకలో 21 మంది మరణించారు. ఈ సంఖ్య డిసెంబర్ 9 నుంచి చూస్తే అత్యధికం. పంజాబ్ రాష్ట్రంలో 64 మంది, ఛత్తీస్‌గఢ్ 35 మంది, తమిళనాడులో 16 మంది, మధ్యప్రదేశ్‌లో 10 మంది, ఉత్తర ప్రదేశ్ 10 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పాయి. Which one are you? Wear your mask properly and protect yourself & your loved ones! Take the #JanAndolan pledge today: https://t.co/fmjbPva8fl #IndiaFightsCorona pic.twitter.com/XaJrrBB1SB — MyGovIndia (@mygovindia) March 31, 2021 మహారాష్ట్రలో 27,918 కేసులు నమోదయ్యాయి, ఆదివారం గరిష్ట స్థాయి 40,000 నుండి గణనీయంగా పడిపోయింది. దీనికి కారణం తక్కువ పరీక్షలు చేయడమే. దేశంలో ఇప్పుడు 5.52 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా, 1,14,34,301 మందికి పైగా ఈ వ్యాధి నుండి కోలుకున్నారు.