సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: శనివారం, 29 మే 2021 (17:07 IST)

ఏపీలో తగ్గుతున్న కరోనావైరస్ కేసులు

ఏపీలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపిస్తోంది. పాజిటివ్ రేటు 25% నుండి 17% కు తగ్గింది.  నమూనా పరీక్షలు 79564 చేస్తే వాటిలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 13756 గా తేలింది. కరోనా పాజిటివ్ రేట్  17%. మరణాలు  104 మంది. మరణాల రేటు ఇంకా తగ్గలేదు.
 
 అధిక మరణాలు  పశ్చిమగోదావరి 20 చేసుకున్నాయి. అత్యధిక కేసులు చిత్తూర్ 2155, తూర్పు గోదావరి  2301, మిగిలిన జిల్లాలలో కాస్త అదుపులోకి వచ్చాయి. కరోనా యాక్టివ్ కేసులు 173622 వుండగా కరోనా మృతులు ఇప్పటివరకు 10738  (0.64%).  రికవరీ 16.71లక్షలలో 14.87 లక్షల మంది రికవర్ అయ్యారు. (89%) 
 
రికవరీ శాతం కూడా కొద్దిగా పెరిగింది. సుమారు 1.73 లక్షల  పాజిటివ్ కేసులు, ఇంకా పరిక్షించాల్సిన లక్షలమంది మన చుట్టూ ఉన్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళవద్దు. వెళ్లినా తప్పక మాస్కులు ధరించండి భౌతిక దూరం పాటించండి.. జాగ్రత్త గా ఉంటూ కుటుంబాన్ని కాపాడుకోవాలి.  లేదంటే కుటుంబం మొత్తం ఆసుపత్రి పాలవుతుంది. మనందరి జాగ్రత్త వలన ఇప్పుడిప్పుడే Covid  తగ్గుముఖం పడుతోంది. కొంత కాలం ఇలాగే జాగ్రత్తగా ఉంటే కరోనా పైన విజయం మనదే అవుతుంది