శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Updated : గురువారం, 18 జూన్ 2020 (11:26 IST)

చూస్తుండండి, మందులు లేకుండానే కరోనావైరస్ చచ్చిపోద్ది: డోనాల్డ్ ట్రంప్

కరోనా వైరస్ మహమ్మారి అనేది వ్యాక్సిన్ లేకుండానే జావగారిపోతుందనీ, ఐతే పరిశోధకులు దానిని పూర్తిగా అంతమొందించాలనే ప్రయత్నంలో వున్నారని అమెరికా అధ్యక్షుడు డోలాల్డ్ ట్రంప్. కొంతకాలానికి కరోనావైరస్ మందులు లేకుండానే తగ్గిపోతుందని ఆయన అన్నారు. ఈ ప్రకటన అమెరికాలో ప్రకంపనలు సృష్టించింది.
 
కాగా అమెరికాలో ప్రతిరోజూ 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా వారిలో సగానికి పైగా ప్రాణాల కోసం పోరాడుతున్నారు. కాగా ఈ ఏడాది చివరిలో కానీ వచ్చే ఏడాదిలో కానీ కరోనా వైరస్ అంతానికి వ్యాక్సిన్ కనుగొంటామని అమెరికన్ శాస్త్రవేత్తలు చెపుతున్నారు.
 
ఐతే ఆలోపే కరోనా వైరస్ ఉధృతి తగ్గిపోతుందనీ, ప్రజల్లో ఆ వైరస్ పట్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని ట్రంప్ జోస్యం చెపుతున్నారు. మరి ట్రంప్ మాటలు ఎంతమేరకు నిజమవుతాయో చూడాలి.