శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సిహెచ్
Last Modified: శనివారం, 1 ఆగస్టు 2020 (22:43 IST)

కరోనావైరస్, ప్లాస్మా చికిత్స ఎలా పనిచేస్తుంది?

కరోనావైరస్ సృష్టిస్తున్న కల్లోలం అంతాఇంతా కాదు. వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఎంత కట్టడి చేసినా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. COVID-19 నయం చేసేందుకు వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఐతే ఈలోపు కరోనా రోగులను ప్రాణాలతో రక్షించడానికి అనేక పరిశోధనాత్మక చికిత్సలు వచ్చాయి. వాటిలో ప్లాస్మా థెరపీ ఒకటి. ఈ ప్లాస్మా థెరపీ ఎలా పనిచేస్తుందన్న సందేహం చాలామందిలో వుంది.
 
కరోనారోగులకు అందించే ప్లాస్మా చికిత్స కోసం COVID-19 నుండి కోలుకున్న రోగుల ప్లాస్మాను సేకరిస్తారు. ఎందుకంటే వీరు కరోనావైరస్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు కనుక వీరి దేహంలో కరోనాను అడ్డుకోగల యాంటీబాడీ ఉత్పత్తై వుంటాయి. ఐతే ఈ ప్లాస్మా చికిత్స ప్రారంభ దశలో ఉన్న రోగులకు, కోలుకున్న రోగుల నుండి ప్లాస్మా (సాధారణంగా 28 వ రోజు నుండి తేలికపాటి దశలో లేదా ఇతర రోగులలో కోలుకున్న 14 రోజుల తరువాత), కొత్తగా సోకిన రోగులలో పోరాడటానికి ప్రతిరోధకాలు లేని రోగులలో ఉపయోగించవచ్చు.
 
సాధారణంగా రెండవ దశలో, కరోనావైరస్ కారణంగా ఊపిరితిత్తులు ప్రభావితమవుతాయి. అది న్యుమోనియాగా మారుతుంది. నిరంతర దగ్గు, ఊపిరి తీసుకోలేని లక్షణాలు కనబడతాయి. ఈ సందర్భంలో రోగికి నిరంతరం ఆక్సిజన్ అవసరం ఉంటే, ప్లాస్మా ఇవ్వవచ్చు. అలాగే ఇవి ట్రయల్ థెరపీలు కాబట్టి, అవి అన్ని సందర్భాల్లో పనిచేస్తాయని అనుకోలేము. సరైన టైమింగ్‌పైన కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వీటిని ప్రారంభ దశలో ఇవ్వాలి.
 
ప్లాస్మాతో పాటు, యాంటీవైరస్ ఔషధాలు అయిన రెమ్‌డెసివిర్ తదితర యాంటీవైరల్స్ ఉపయోగించాల్సి వుంటుంది. కాబట్టి, అటువంటి చికిత్సలన్నింటినీ కలిపి ఉపయోగించినప్పుడు రోగులు కోలుకోవచ్చు. ఇవన్నీ ఉన్నప్పటికీ, చాలా మంది రోగుల పరిస్థితి మెరుగుపడటంలేదు. ఐతే, ఇప్పుడున్న చికిత్సలలో ప్లాస్మా థెరపీ కొంతమేరకు ప్రయోజనం చేకూరుస్తోంది. త్వరలో కరోనావైరస్ కట్టడికి వ్యాక్సిన్లు రాబోతున్నట్లు ప్రపంచంలో పలు దేశాలు వెల్లడిస్తున్నాయి.