మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By జె
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (16:15 IST)

సిఎం సారూ, హస్మద్ షూట్ ఎక్కడ? అది లేకుంటే వైద్యులకు కరోనా ఖాయం?

ప్రపంచమే కరోనా వైరస్ భయంతో వణికిపోతోంది. ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలలో ఇప్పటికే వేలమంది చనిపోయారు. మరికొంతమంది ప్రాణాలతో కొట్టుమిట్టుమిట్టాడుతున్నారు. ఉన్న క్వారంటైన్‌లో కాస్త ఇక రోగులకు సరిపోతుందో.. లేదోనన్న అనుమానం అందరిలోను కలుగుతోంది. 
 
అయితే ఒకవైపు ప్రభుత్వాలు మాత్రం కరోనా వ్యాప్తి చెందకుండా ప్రయత్నం చేస్తున్నామని చెబుతూనే ఉన్నా బాధితుల సంఖ్య మాత్రం విపరీతంగా పెరిగిపోతూనే ఉంది. అయితే రోగులకు వైద్యం చేసే వైద్యుల పరిస్థితి ఏంటో ఆలోచించాల్సిన సమయం వచ్చింది. 
 
ఇప్పటికే వైద్యులందరూ కరోనా పాజిటివ్ వచ్చిన రోగులకు పూర్తిస్థాయిలో చికిత్స చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారికి అవసరమైన సౌకర్యాలు కరువయ్యాయి. అసలు వారికి కరోనా వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఒక వైద్యుడు స్వయంగా ఈ విషయాన్ని తెలిపాడు. 
 
మేము మా ప్రాణాలకు తెగించి రోగులకు ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అయితే మా ప్రాణాలు రోగుల వల్లే పోయేలా ఉన్నాయి. మాకు ముఖానికి మాస్క్, చేతికి గ్లౌస్, చిరిగిపోయిన ఆర్ఫాన్ ఇస్తున్నారు. దీంతో మేము ఎలా ట్రీట్మెంట్ చేయగలం. ఇలా చేస్తే మాకు ఆ వైరస్ అంటుకుంటుంది. 
 
సిఎం సర్.. మమ్మల్ని పట్టించుకోండి, హస్మద్ షూట్ ఇప్పుడు చాలా ముఖ్యం. నా ఒక్కడికే కాదు కరోనా పాజిటివ్ వచ్చిన రోగులందరికీ ఇది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. లేకుంటే వైద్యులందరికీ వైరస్ సోకుతుందని తిరుపతికి చెందిన శ్రీధర్ స్వయంగా ఒక వీడియో తీసి వాట్సాప్‌లో అందరికీ షేర్ చేశారు.
 
అసలు ఎపిలో ఇప్పటివరకు హస్మద్ షూట్ గురించి మాట్లాడుకున్నారా? అస్సలు లేదు. ఇలా అయితే ఎలా.. ముందు ప్రభుత్వం చేయాల్సింది ఆ షూట్‌ను వెంటనే మాకిప్పించండి అంటూ ఆ వీడియోలో కోరాడు వైద్యుడు శ్రీధర్.