మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 జనవరి 2022 (10:43 IST)

హైదరాబాద్‌ ఐఐటీలో కరోనా: 123 మందికి పాజిటివ్

హైదరాబాద్‌ ఐఐటీలో కరోనా కలకలం రేపింది. బుధవారం 123 మందికి కరోనా సోకింది. వీరిలో 107 మంది విద్యార్థులు వున్నారు. అలాగే ఏడుగురు ఫ్యాకల్టీలు, ఆరుగురు ఇతర ఉద్యోగులున్నారు. 
 
ఈ నెల తొలి వారం వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఐఐటీకి వచ్చారు. ఐదో తేదీన ఇద్దరు విద్యార్థులకు స్వల్ప లక్షణాలుండటంతో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది. 
 
ఈ నేపథ్యంలో రెండుడోసుల వ్యాక్సినేషన్‌ తీసుకున్నట్టు సర్టిఫికెట్‌ ఉన్నవారినే క్యాంపస్‌లోకి అనుమతించారు. అయినా కేసులు పెరుగుతున్నాయి. 
 
అలాగే సంగారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం క్యాంపస్‌లో 2 వేలమంది విద్యార్థులు, 250 మంది ఫ్యాకల్టీలు, వారి కుటుంబీకులు ఉన్నారు.