Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 20 వేలకు దిగువకు చేరిన పాజిటివ్ కేసులు

Written By ఠాగూర్
Updated: శనివారం, 9 అక్టోబరు 2021 (11:12 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. క‌రోనా కేసులు 20 వేల‌ దిగువ‌కు చేరాయి. గడిచిన 24 గంటల్లో 19,740 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 206 రోజుల క‌నిష్టానికి చేరింది. 
 
ప్ర‌స్తుతం 2,36,643 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం 23,070 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రిక‌వ‌రీల సంఖ్య‌ 3,32,48,291కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.56 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 58.13 కోట్ల క‌రోనా టెస్టులు చేశారు. 
 
గతకొంతకాలంగా దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో కేరళలోనే అత్యధికంగా ఉంటున్నాయి. అయితే రెండు వారాలుగా ఆ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. దీంతో దేశంలో కూడా కరోనా కేసులు తుగ్గుతున్నాయి. కేరళలో శుక్రవారం 10,944 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇక వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు మాత్రమే ఉన్నాయి. 

అన్నీ చూడండి

Hanuman Ansh: కాంతార, ది కాశ్మీర్ ఫైల్స్‌ను వెనక్కి నెట్టిన హనుమాన్ అన్ష్

ఏవియేషన్ రంగం నుంచి హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తున్న ప్రార్థనా చాబ్రియా

మహిళల భావోద్వేగాల అంశంతో హ్యాపీ జర్నీ చిత్రం విడుదలకు సిద్ధం

Allu Aravind: అల్లు అర‌వింద్ పై యశ్ మ‌ద‌ర్ విమర్శించడంలో పసలేదు

మణిశర్మ సంగీతం హైలైట్ గా గజ సినిమా విజయం ఖాయం : సాయి రాజేష్

తర్వాతి కథనం
Show comments