బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (17:27 IST)

జాన్సన్ అండ్ జాన్సన్ నుంచి సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్.. ఎప్పుడొస్తుందో?

కరోనా వ్యాక్సిన్ తయారీలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ నిమగ్నమైన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన ఈ సంస్థ… తాజాగా సింగిల్ డోస్ తయారు చేసింది. 'జాన్సన్' పేరిట తయారు చేసిన ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలంటూ…శుక్రవారం దరఖాస్తు చేసుకుంది. గతంలో ఈ సంస్థ భారతదేశంలో ప్రయోగాల కోసం దరఖాస్తు చేసుకుని..చివరి నిమిషంలో ఉపసంహరించుకుంది. 
 
ఇప్పటికే పలు దేశాలు అనుమతించిన ప్రముఖ వ్యాక్సిన్లను ట్రయల్స్ అవసరం లేకుండానే…అత్యవసర వినియోగానికి అనుమతించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. పాత దరఖాస్తును ఉపసంహరించుకన్న అనంతరం తాజాగా.. అత్యవసర వినియోగం కోసం మరోసారి దరఖాస్తు చేసుకుంది. 
 
భారతదేశ ప్రజలకు సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందించే దిశగా…చాలా ముఖ్యమైన అడుగుగా సంస్థ అభివర్ణించింది. హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థతో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ చేతులు కలిపిన సంగతి తెలిసింది. మరి ప్రభుత్వం అనుమతినిస్తుందా ? లేదా ? అనేది చూడాలి.