బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2021 (11:07 IST)

తెలంగాణాలో 146 - దేశంలో 12923 పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు ఇంకా కొనసాగుతూనే వుంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 29,755 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 146 మందికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ లెక్కల ప్రకారం గత 24 గంటల్లో కరోనాతో ఒక్క మ‌ర‌ణం కూడా సంభ‌వించ‌లేదు. అదేసమయంలో 118 మంది కోలుకున్నారు.
 
ఇకపోతే, రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,134కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,92,696 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,613గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,825 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 765 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు.
 
మరోవైపు, దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 12,923 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదేస‌మ‌యంలో 11,764 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,71,294కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 108 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,360 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,05,73,372 మంది కోలుకున్నారు. 1,42,562 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 70,17,114 మందికి వ్యాక్సిన్ వేశారు.
       
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 20,40,23,840 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 6,99,185 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.