దేశంలో కరోనా స్వైరవిహారం.. 30 వేల మంది కేంద్ర పోలీసులకు పాజిటివ్

rapid action force
ఠాగూర్| Last Updated: సోమవారం, 28 సెప్టెంబరు 2020 (09:17 IST)
దేశంలో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. దీంతో ప్రతి రోజూ 80 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ బారినపడుతున్నవారిలో దేశ ప్రజలే కాదు.. సైనిక బలగాలు కూడా ఉన్నాయి. కేంద్రం హోంశాఖ ఆధ్వర్యంలోని పోలీసు బలగాలైన సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీ, ఎన్‌ఎస్‌జీ, ఎన్‌డీఆర్ఎఫ్‌కు చెందిన దాదాపు 36 వేల మంది ఈ వైరస్ బారినపడ్డారు. వీరిలో 128 మంది మృతి చెందినట్టు తాజా నివేదికను బట్టి తెలుస్తోంది. 30 వేల మంది వైరస్ నుంచి బయటపడగా, 6 వేల మంది చికిత్స పొందుతున్నారు.

ఇక, వైరస్ బారినపడిన వారిలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దులలో విధులు నిర్వర్తించే బీఎస్ఎఫ్ సిబ్బంది ఎక్కువ మంది ఉండటం గమనార్హం. ఇప్పటివరకు 10,636 మంది కరోనా బారినపడగా, సీఆర్‌పీఎఫ్‌లో 10,602 మంది, సీఐఎస్ఎఫ్‌లో 6,466 మంది, ఐటీబీపీలో 3,845 మంది, ఎస్ఎస్‌బీలో 3,684 మంది, ఎన్‌డీఆర్ఎఫ్‌లో 514 మంది, ఎన్ఎస్‌జీలో 250 మందికి ఉన్నారు. ఈ వైరస్ కారణంగా సీఆర్‌పీఎఫ్‌లో 52 మంది, బీఎస్ఎఫ్‌లో 29 మంది, సీఐఎస్ఎఫ్‌లో 28 మంది ప్రాణాలు కోల్పోగా, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీలలో 9 మంది చొప్పున మృతి మృతిచెందినట్టు కేంద్రం హోంశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి.దీనిపై మరింత చదవండి :