దేశంలో కొత్తగా మరో 11649 పాజిటివ్ కేసులు
దేశంలో కొత్తగా మరో 11649 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,16,589కు చేరింది. ఇందులో 1,06,21,220 మంది బాధితులు కోలుకోగా, 1,55,732 మంది మహమ్మారి వల్ల మృతిచెందారు. మరో 1,39,637 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
కాగా, గత 24 గంటల్లో కొత్తగా 9,489 మంది వైరస్ బారినుంచి బయటపడగా, 90 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగున్నది. ఇప్పటివరకు 82,85,295 మంది ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు టీకా తీసుకున్నారు.
మహరాష్ట్రలో కొత్తగా 4092 మంది కరోనా బారినపడగా, 40 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 20,64,278కి, మరణాలు 51,529కి చేరాయి. ఇందులో 35,965 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఒక్క ముంబై పట్టణంలోనే 645 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.
ఇకపోతే, తెలంగాణలో కొత్తగా 99 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అదేసమయంలో 169 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,673కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,93,379 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,618గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,676 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 705 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు.