గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 జూన్ 2021 (12:20 IST)

కోవాగ్జిన్‌ నో స్టాక్.. ఢిల్లీ సర్కార్ కీలక ఆదేశాలు..18-44 ఏళ్ళ మధ్య..?

కోవాగ్జిన్‌పై ఢిల్లీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ కొరత కారణంగా ఢిల్లీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ విధానంలో కొత్త పంథా అనుసరిస్తోంది. 18-44 ఏళ్ళ మధ్య వయస్సువారిలో రెండో డోసు అవసరమైనవారికే కోవాగ్జిన్ టీకామందు ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. మొదటి విడత తీసుకోవలసినవారిని తిప్పి పంపివేయాలని అన్ని ప్రైవేటు ఆసుపత్రులను, నర్సింగ్ హోమ్‌లను ఆదేశించినట్టు అధికారులు వెల్లడించారు. 
 
టీకా స్టాక్ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా స్టాక్ లేదని, ఈ కారణంగా మొదటి డోసు తీసుకోగోరేవారికి ఛాన్స్ లేదని అంటున్నారు. ముఖ్యంగా కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో ఓ వ్యూహాన్ని పాటించాలని ఢిల్లీ హైకోర్టు గతవారం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి సూచించింది. ఈ వ్యాక్సినేషన్ విధానంలో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయంటూ దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈ సూచన చేసింది.