శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 21 జూన్ 2022 (21:16 IST)

తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్ కేసులు: అవసరమైతేనే దూరప్రయాణాలు చేయండి

corona Virus
తెలంగాణలో క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 403 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఆరోగ్య శాఖ అప్రమత్తమై తగు సూచనలు చేసింది.

 
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని సూచించింది. జనసమ్మర్ద ప్రాంతాలలోకి వెళ్లవద్దనీ, మరీ అవసరమైతే భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కు తప్పనిసరిగా వేసుకోవాలని తెలిపింది. వృద్ధులు మరింత జాగ్రత్త వహించాలని, కోవిడ్ టీకా వేసుకోనివారు వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.

 
కరోనా లక్షణాలు ఏమయినా కనబడితే వెంటనే వైద్యుడిని సంప్రదించి మందులు వాడాలని సూచించారు ఆరోగ్యశాఖ అధికారులు. మరోవైపు దేశంలో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.