శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 సెప్టెంబరు 2020 (20:10 IST)

మళ్లీ అస్వస్థతకు గురైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఎక్మో సపోర్ట్ మీద చికిత్స

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మళ్లీ అస్వస్థతకు లోనయ్యారు. ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలుకు కరోనా సోకడంతో సుమారు 40 రోజులుగా అదే ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. పూర్తిగా కోలుకుంటున్న సమయంలో ఆయన మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. కరోనా తగ్గినా ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. 
 
ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.  ఓ దశలో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించినప్పటికీ చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు ప్రత్యేక చికిత్స అందించి, ఆయన కోలుకునేలా చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ బాలు ఇప్పుడు మరోసారి ఆసుపత్రిలో చేరటంతో ఆయన అభిమానులంతా ఆందోళకు గురవుతున్నారు.
 
ఆసుపత్రి నుండి బాలు ఆరోగ్యంపై బులెటిన్ వెలువడింది. ఆయన ఆరోగ్య పరిస్థితి 24 గంటల వ్యవధిలో బాగా క్షీణించినట్టు పేర్కొంది. అయితే ఆయనకి ఇంకా ఎక్మో సపోర్ట్ మీద చికిత్స అందిస్తున్నారు. 
బాలసుబ్రహ్మణ్యంకు ప్రస్తుతానికి లైఫ్ సపోర్ట్ మీదనే చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆసుపత్రి చెబుతోంది. నిజానికి ఈ నెల 19 నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి హెల్త్ బులిటెన్‌ని విడుదల చేయలేదు. కుమారుడు చరణే రోజూ అబిమానుల కోసం ఈ సమాచారాన్ని అందిస్తున్నాడు.