శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: బుధవారం, 19 ఆగస్టు 2020 (12:55 IST)

తెలంగాణ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్నది. ఇదివరకే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే  కరోనా బారిన పడ్డారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు కరోనా సోకింది.
 
ఇప్పటివరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని సురేందర్ సహా నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా బారిన పడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సురేందర్ ప్రస్తుతం హైదరాబాదులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పలు కార్యక్రమాలలో పాల్గొంటున్న కారణంగా ప్రజా ప్రతినిధులు కోవిడ్ 19 మహమ్మారి బారిన పడుతున్నారు.
 
ఎమ్మెల్యే సురేందర్ సైతం ఇటీవల కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సమాచారం. పలు సమావేశాలకు, కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా ప్రజాప్రతినిధులు తీవ్రంగా కరోనా బారిన చిక్కుకోవడం వలన కొందరు ప్రముఖులు, రాజకీయ నాయకుల మధ్య తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నాయి.